అటా సభ్యుల మధ్య తోపులాట, దుర్భాషలు ugly physical brawl in ATA Leadership nominations

Ugly physical brawl in ata leadership nominations

Shocking, video footage, shocking incident, ata, american telugu association leaders fight, hanumantha reddy, harindar reddy, ATA leaders fight, ATA america leaders fight, Hanumantha Reddy Harindar Reddy fight, American Telugu Association

ATA leadership involved in an ugly public physical brawl in United States Postal Services during election nominations of the said organisation.

ITEMVIDEOS: అమెరికా వీధుల్లో తెలుగు వారి పరువుకు ‘గోరి’

Posted: 10/17/2016 06:53 PM IST
Ugly physical brawl in ata leadership nominations

అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులకు.. అక్కడున్న తెలుగు సంఘాల ఎన్నికలలో నిలిచిన అబ్యర్థులకు మద్య ఆ విషయంలో మాత్రం పెద్ద తేడా కనిపించడం లేదు. అయితే అధక్ష్య బరిలో నిలిచిన వారు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూనే ఒకరిపై మరోకరు నేరుగా విమర్శనాస్త్రాలను సంధించుకుంటుండగా, అక్కడున్న తెలుగు వారి ఏకంగా ముష్టిగాతాలకు కూడా పాల్పడేస్థాయికి దిగజారి.. అమెరికా వీధుల్లో తెలుగువారి పరుపుకు గోరి కట్టేస్థాయికి దిగజార్చారు.

పెళ్లి చూపుల దగ్గర్నించి అన్ని విషయాల్లో అమెరికా అంటే చెవి కోసుకునే రాష్ట్రంలోని తెలుగువారు.. అక్కడికి వెళ్లి స్థిరపడిన మనవారు ఓ సందర్భంలో మాట్లాడే భాష.. అసభ్యపదజాలం చూసి విస్తుపోతున్నారు. ఔరా..! వీళ్లు మనవాళ్లేనా..? అది అమెరికాలోనే వున్నారా.? లేక మన రాష్ట్రంలోని మురికివాడల్లో వున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తకమానవు. సభ్యతా, సంస్కారానికి వీడ్కోలు పలికి మరీ అసభ్యంగా దుర్భాషలాడుకున్న వైనం తాజాగా బయటపడటంతో అది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతూ వైరల్ గా మారుతుంది.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ నామినేషన్ల పర్వంలో యూనైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీసెస్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ కు ప్రతి రెండేళ్లకు ఓ పర్యాయం ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఎన్నికలలో అటా బోర్డు ట్రస్టీలను తమ సంస్థ యొక్క నియమనిబంధనల ప్రకారం ఎన్నకుంటుంది. అయితే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల కో-ఆర్డినేటింగ్ అధికారి పర్యవేక్షణలో తమ కార్యాలయాలకు తీసుకువెళ్తారు. ఇక ఎన్నికల తీరు మొత్తం ట్రాన్స్ ఫరెంట్గానే వుంటుంది. అయితే ఆ సమయానికి అక్కడకు వచ్చే ఆట సభ్యులు ఈ యావత్ ప్రక్రియను పరిశీలించే అవకాశం కూడా వుంటుంది. వారందరి సమక్షంలోనే నామినేషన్లను ఆట కార్యాలయానికి తీసుకెళ్లి, స్ర్కూట్నీ చేసి తరువాత స్కాన్ చేస్తారు.

ఈ సందర్భంగా ఈ దఫా జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన హనుమంత్ రెడ్డి.. సభ్యులుగా పరిశీలించేందుకు వచ్చిన మాజీ ట్రస్టీ హరిందర్ రెడ్డి, మాజీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డీలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అదేశించారు. అయితే అందుకు నిరాకరించిన హరించర్ రెడ్డి హనుమంత రెడ్డిని అసభ్యపధజాలంతో దూషించాడు. అంతే దానిని ప్రతిగా హన్మంతరావు కూడా హరిందర్ రెడ్డిని దుర్భాషలాడారు. అవి క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఒకరిపై మరోకరు చేయిచేసుకునే స్థాయికి చేరాయి. వాటిని మేం చెప్పడం కన్నా మీరే చూడండీ..

ఈ రెండు వర్గాల మధ్య తారాస్థాయికి వివాదం చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తొలుత హరిందర్ రెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పిన పోలీసులు ఆ తరువాత హన్మంత్ రెడ్డి సహా ఆట సభ్యులందరీ పోస్టాఫీసు కార్యాలయం వదలి వెళ్లాల్సిందిగా అదేశించారు. ఈ క్రమంలో హన్మంత్ రెడ్డి ఆట ట్రస్టీల కోసం వచ్చిన నామినేషన్ పత్రాలన్నింటినీ తీసుకుని వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం అక్కడికి వచ్చిన వారికి పత్రాలను చూపించాల్సి వున్నా వివాదం కారణంగా పత్రాలను ఎవరికీ చూపించకుండానే అటా కార్యాలయానికి తరలించారు. అయితే అదే అనుమానంతో అక్కడికి వచ్చామని ముందుగానే చెప్పిన హరిందర్ రెడ్డికి.. తనదో లేక తనవారిదో నామినేషన్ చేరిందా..? లేదా.? అన్న విషయమై కూడా క్లారిటీ రాలేదు.

కాగా ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆట నామినేటింగ్ చైర్ డా్టర్ మెహర్ మేధావరం, శ్రీమతి భారతి పుల్లూర్లతో పాటుగా తనను కూడా నామినేషన్ పత్రాలను పోస్టాఫీసు నుంచి సేకరించి.. అమ కార్యాలయానికి తీసుకువచ్చే బాధ్యతను అప్పగించిందని చెప్పారు. ఈ క్రమంలో తాము నపెర్ విల్లీ సోస్టాఫీసుకు చేరుకోగానే తమ కోసమే సుమారు 15 మంది వ్యక్తులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు తనకు తెలుసునని, మరికోందర్ని తాను ఎరుగనని అన్నారు. తాము నామినేషన్లను తీసుకుంటున్న సమయంలో హరిందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తమపై దాడికి పాల్పడ్డారని, ఈ పెనుగులాటలో భారతి రమారమి పడిపోయినంత పనైందని చెప్పారు.

నామినేషన్ చైర్ అనుమతి లేకుండా వారు నామినేషన్ల సేకరణకు పోస్టాఫీసుకు రావాల్సిందికాదని హన్మంత్ రెడ్డి అన్నారు. ఇక తమపై దాడి చేసేందుకు ముందుగానే ప్రణాళిక రచించుకుని సుమారు 15 మంది గుండాలతో వచ్చి దాడికి యత్నించడం సరైంది కాదని, వారికి అటాలో సభ్యత్వం కూడా లేదని, అలాంటి వారు వచ్చి తమ కోసం కాపు కాయడం సమంజసమా అని అయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : American Telugu Association  Hanumantha Reddy  Harindar Reddy  ata physical brawl  

Other Articles