రాజీవ్ ట్రస్ట్ కి 50 లక్షలు ఇచ్చాడంట | Zakir Naik NGO IRF gave Rs 50 lakh to Rajiv Gandhi trust

Zakir naik ngo irf gave rs 50 lakh to rajiv gandhi trust

Zakir Naik Rajiv Gandhi, Zakir Naik NGO IRF, Zakir Naik links Congress, Zakir Naik Rajiv links, Zakir Naik political links, Zakir Naik foundation, Zakir Naik Digvijay Singh, Islamic research foundation Zakir Naik

Zakir Naik NGO IRF gave Rs 50 lakh to Rajiv Gandhi trust.

కాంగ్రెస్ తో జకీర్ బంధం బలపడుతోంది

Posted: 09/10/2016 10:26 AM IST
Zakir naik ngo irf gave rs 50 lakh to rajiv gandhi trust

యువతకు ఉగ్రవాద పాఠాలు బోధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత గురువు జకీర్ నాయక్ కి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో జకీర్ కు మంచి సంబంధాలు ఉన్నాయన్నది ధృవీకరించే విషయం ఒకటి వెలుగుచూసింది. ముంబై కేంద్రంగా జకీర్ కు ‘ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)’ పేరిట స్వచ్ఛంద సంస్థ ఉంది. దీని నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరిట ఏర్పాటు చేసిన ఓ ట్రస్ట్ కు భారీగా విరాళాలు అందాయంట.

2011 లో జకీర్ ఐఆర్ఎఫ్ 50 లక్షల రూపాయలను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి అందజేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే అయితే, అందిన విరాళాన్ని కొన్ని నెలల తర్వాత తిరిగి ఐఆర్ఎఫ్ కు తిప్పిపంపామని కాంగ్రెస్ చెప్పింది. కానీ, ఐఆర్ఎఫ్ మాత్రం వెనక్కి పంపామని కాంగ్రెస్ చెప్పేది నిజం కాదని చెప్పటం కొసమెరుపు. ఆ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో జకీర్ కు సంబంధాలున్నాయన్న వార్తలు పెను కలకలమే రేపాయి.

వివాదాస్పద ఈ మతగురువుకు పలు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని, ఆ కారణంగానే ‘పీస్ టీవీ’ ద్వారా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నప్పటికీ అతడిపై ఈగ కూడా వాలలేదన్న వాదన వినిపిస్తోంది. ఇలా జకీర్ తో అంటకాగిన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒకటి ఉందనే వార్తలు రాగా, తాజా విషయాలతో వారి బంధం నిజమేనన్న వార్తల్లో నిజం లేకపోలేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zakir Naik  IRF  Rajiv Gandhi  Foundation  donation  

Other Articles