పద్మ అవార్డులు ఇక నుంచి ప్రజలే నిర్ణయిస్తారు | Padma Awards nomination process open for general public

Government throws padma awards nomination process open for general public

Government throws Padma Awards nomination process, Padma Awards portal, Padma Awards nominations by public, general public for Padma Awards, Padma Awards nomination process

Padma Awards nomination process open for general public.

పద్మ అవార్డులు ఇక నుంచి పబ్లిక్ చేతుల్లోనే...

Posted: 09/10/2016 09:50 AM IST
Government throws padma awards nomination process open for general public

ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల్లో తలెత్తుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై పద్మ అవార్డు గ్రహీతలను ప్రజలే ఎన్నుకునేలా సవరణ తీసుకొచ్చింది. సమాజానికి సేవలందించిన, విజయాలు సాధించి పెట్టిన వారి పేర్లను ఇక నుంచి ప్రజలే నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించింది. పైరవీలకు తావు లేకుండా, అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు పద్మ పౌరపురస్కారాల కోసం సిఫార్సులు చేస్తూ అర్హుల పేర్లతో కూడిన జాబితాను పంపిస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుని భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. అయితే దీనిలో వివక్షత జరుగుతోందని ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రజలే అర్హులైన వారిని నామినేట్ చేసి, ఆపై ఎక్కువ మంది ఎవరిని నామినేట్ చేస్తే వారిని ఎన్నుకునే విధంగా కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ఈ సవరణ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడూ నామినేషన్‌లో పాలుపంచుకోవచ్చు. ముందుగా ఆన్‌లైన్‌లో అర్హుల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినేట్ చేసే వారు తమ ఆధార్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అర్హులు అనిపించిన వ్యక్తుల పేర్లను నామినేట్ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్‌కు ఈ నెల 15 చివరి తేదీ కాగా ఇప్పటికే 1700 నామినేషన్లు వచ్చాయని అధికారి ఒకరు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padma Awards  Central govt  nomination process  General Public  Nominations  

Other Articles