ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా | Speaker Kodela adjourned AP assembly monsoon session.

Ap asssembly monsoon session end

YSRCP and TDP MLAs clash, AP assembly Media Point war, Speaker Kodela adjourned AP assembly, AP monsoon assembly session end, YCP MLAs interrupt assembly, AP monsoon session

Speaker Kodela adjourned AP assembly monsoon session. YSRCP and TDP MLAs clash at Assembly media point.

ITEMVIDEOS:మీడియా పాయింట్ వద్ద లొల్లి.. లాస్ట్ డే సేమ్ సీన్... నిరవధిక వాయిదా

Posted: 09/10/2016 10:49 AM IST
Ap asssembly monsoon session end

ఇంతవరకు ఎప్పుడు చోటుచేసుకోని ఘటనలు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దర్శనమిచ్చాయి. వరుసగా మూడో రోజు సమావేశాలు కూడా యుద్ధ వాతావరణాన్ని తలపించడంతో వర్షాకాల సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కొడెల శివప్రసాద్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. మార్షల్స్ ను రంగంలోకి దించడం, వారితో నేతలకు తోపులాట చోటుచేసుకోవటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ హాలులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తాజాగా మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నాయి కూడా.

ఈ క్రమంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు ముందుగా వైసీపీ చేరుకోగా... ఆ తర్వాత టీడీపీ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సాక్షిగానే ఇరు పక్షాల ఎమ్మెల్యేలు వాగ్యుద్ధానికి దిగారు. మీడియా కెమెరాల ముందు వైసీపీ నేతలు మాట్లాడేందుకు సిద్ధపడగా, మీడియా కెమెరాలకు అడ్డంగా నిలబడ్డ టీడీపీ సభ్యులు తాము కూడా మీడియాతో మాట్లాడేందుకు యత్నించారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

 

టీడీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి దిగుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్దే బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. మ‌రోవైపు వైసీపీ నేత‌ల తీరుపై టీడీపీ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. వైసీపీకి స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధిలేద‌ని తెలుగుదేశం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే.. టీడీపీ నేత‌లే ప్ర‌జా సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

గాంధీ విగ్రహం ముందు ధ‌ర్నాకు దిగేందుకు వైసీపీ నేత‌లు సిద్ధం కాగా పోలీసులు ఇరు వ‌ర్గాల‌కు సర్దిచెప్పారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసురుతూ, ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. నిరసనల మధ్యే సభ కొనసాగింది. దీంతో కోడెల సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Assembly  Monsoon Session  end  

Other Articles