మండలిలో ప్యాకేజీపై చంద్రబాబు | chandra babu in AP Legislative Council about pacakage

Chandra babu in ap legislative council about pacakage

Chandrababu Naidu Explains Details of Centre's Special Package, AP CM Chandrababu on Centre's Special Package, AP CM Chandrababu Legislative Council about package

CM Chandrababu Naidu in AP Legislative Council about Special pacakage.

ITEMVIDEOS:రాజీ పడబోను... రాజీనామాలు అక్కర్లేదు: మండలిలో చంద్రబాబు

Posted: 09/08/2016 05:37 PM IST
Chandra babu in ap legislative council about pacakage

ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కుచ్చుటోపీ పెట్టి, ప్యాకేజీతో సరిపెట్టిన అంశంపై విపక్షాలు రాష్ట్రంలో రోడ్డెక్కి నిరసనలు చేపట్టాయి. తన వంతు భాగంగా ప్రతిపక్ష వైఎస్సార్పీపీ సైతం శాసనసభ సైతం జరగకుండా స్థంభింపజేయటంతో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్యాకేజీపై శాసన మండలిలో ప్రకటన చేశారు.

‘నా జీవితంలో రాజీ అనే అంశ‌మే లేదు.. నా చిత్త‌శుద్ధిని ఎవ‌రూ శంకించ‌లేరు. ప్ర‌తిదానికి రాజీనామాలు చేయ‌మ‌న‌డం స‌రికాదు. అధికారం కోసం నేను తాప‌త్ర‌య‌ప‌డబోను. రాష్ట్రాభివృద్ధి విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌బోను’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల అంశంలో రాజీ ప‌డే అవ‌కాశ‌మే లేదని ఆయ‌న అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కావాలంటే కేంద్రం ఆదుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని తెలిపారు.

ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో ఎంతో సెంటిమెంట్ అంశంగా త‌యారైందని చంద్ర‌బాబు అన్నారు. ‘రాష్ట్ర విభ‌జ‌న చీక‌టి గ‌దిలో జ‌రిగింది, మ‌న‌ల్ని ఎంతో బాధ‌క‌లిగించింది. కేంద్రం సాయం చేయాల్సిందే. కేంద్రం నుంచి రావాల్సినవ‌న్నీ అడుగుతూనే ఉన్నాం. ప్ర‌తిప‌క్షాలు మాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప‌ట్టిసీమ‌ను వ‌ట్టిసీమ అన్నారు. ప‌ట్టిసీమ కోసం 9, 10 సార్లు ఢిల్లీకి వెళ్లా, స‌మీక్ష‌లు చేశా. చివ‌రికి పూర్త‌యింది. ఇప్పుడు ప‌ట్టిసీమ వ‌ల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. అన్ని ప‌నులు పూర్తి స‌మ‌ర్థంగా పూర్తి చేస్తాం’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

 

ప్రభుత్వం ఏం చెబుతుందో కూడా వినే ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షం లేదని చంద్ర‌బాబు అన్నారు. శాస‌న‌స‌భ‌లో వారి తీరు బాగోలేద‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప‌నులు అనుకున్న ల‌క్ష్యంలోపే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. వారానికి ఒక‌సారి డ్రోన్ కెమెరాల ద్వారా పోల‌వ‌రం ప‌నులు ప‌రిశీలించాల‌ని కేంద్రానికి వివ‌రించామ‌ని తెలిపారు. తాను నెల‌కోసారి పోల‌వ‌రం వెళ్లి ప‌నులు ప‌రిశీలిస్తున్నట్లు చంద్ర‌బాబు చెప్పారు. పోలవ‌రం ప్రాజెక్టు కోసం 50 వేల ఎక‌రాల భూములు సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. 2018లోపు పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నట్లు తెలిపారు.

14వ ఆర్థిక సంఘంతో తనకు సంబంధం లేదని, అప్పటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయటం, హోదా ఇవ్వాలన్నదే తన డిమాండని ఆయన స్పష్టం చేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కోర్టుల చుట్టూ తిప్పాలని కొందరు నిత్యమూ ప్రయత్నిస్తున్నారని, వారి కోరిక కలగానే మిగులుతుందని అన్నారు. పదిహేనేళ్ల క్రితం వాజ్ పేయి ప్రధానిగా ఉన్న వేళ, తెలుగుదేశం ఎంపీలపైనే బీజేపీ ఆధారపడిందని, ఎన్ని మంత్రి పదవులు ఇస్తామని ఆశ పెట్టినా తాను తలొగ్గలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రులతో రాజీనామాలు చేయించడం ఒక్క సెకను పనని, దాంతో ప్రయోజనాలు ఏం దక్కుతాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో యూపీఏ చేసిన అన్యాయం పై చంద్రబాబు ప్రసంగిస్తుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప‌ వాగ్వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా సాగుతున్నానని, అందుకు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  CM Chandrababu  legislative council  special package  

Other Articles