అఖిల్ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్.. Nag reveals Akhil's engagement date

Nag reveals akhil s engagement date

nagarjuna, akkineni nagarjuna, naga chaitanya, akhil, samantha, Shriya Bhupal, akhil engagement, akhil engagement date, tollywood

Tollywood’s King Nagarjuna finally revealed the big news to our very own reporter declaring his younger son i.e, Akhil’s engagement date as December 9th.

అఖిల్ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్

Posted: 09/08/2016 08:23 PM IST
Nag reveals akhil s engagement date

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుల వివాహం ఒక కొలిక్కొ వచ్చింది. సూటిగా, సుత్తిలేకుండా అన్నట్లుగా తన ప్రేమ విషయంమై క్లారిటీగా చెప్పడంతో అక్కినేని అఖిల్ నిశ్చితార్థానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చేశారు. డిసెంబరు 9 వ తేదీన అఖిల్ నిశ్చితార్థం జరగనుందని నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కినేని వారింట త్వరలో శుభకార్యక్రమ వేడుకకు నాంది పలుకనుంది.

ఇక నాగచైతన్య వివాహానికి సంబంధించిన విషయాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండొచ్చని వెల్లడించారు. కుమారుల వివాహాల విషయంలో పూర్తిగా నిర్ణయం వారిదేనని ఇదివరకే నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. చైతన్య.. సమంతతో ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం నాగార్జున క్లారిటీ ఇవ్వలేదు. ఇక అఖిల్ శ్రీయా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ను ప్రేమ వివాహం చేసుకోనున్నారని వినికిడి. మొత్తమ్మీద 2017లో అక్కినేని వాళ్లింట్లో పెళ్లిబాజాలు వినిపించనున్న విషయం మాత్రం దాదాపు స్పష్టమైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles