జీఎస్టీ పై సుబ్రహ్మణ్య స్వామి స్పందన | why Subramanian Swamy Silent On GST

Why subramanian swamy silent on gst

Subramanian Swamy respond On GST bill, subramanian swamy satires on GST bill, GST subramanian swamy , subramanian swamy twitter

BJP leader Subramanian Swamy respond On GST bill.

ఆయన నోరు విప్పితే రచ్చ రచ్చేనంట...

Posted: 08/04/2016 05:45 PM IST
Why subramanian swamy silent on gst

సుబ్రహ్మణ్య స్వామి ఈ పేరు చెబితే ప్రతిపక్షాలే కొద్ది రోజుల క్రితం దాకా సొంత పక్షం కూడా భయంతో వణికిపోయింది. ఏ విషయంలోనైనా తనదైన శైలిలో స్పందించి, కొంపలు ముంచేంత వివాదాలు సృష్టించడం ఆయనకు నోటితో పెట్టిన విద్య. అధిష్టానం వార్నింగ్ ప్రభావమో లేక మరేయితర కారణమో తెలీదు గానీ, ఈ ఎంపీ రాజ్యసభలో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుపై ఇప్పటిదాకా అస్సలు స్పందించలేదు.

అసలు స్వామికి ఏమైంది అని నేతలంతా చెవులు కొరుకున్నారంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతకీ ఆయన ఎందుకు సైలెంట్ అయ్యాడు? జీఎస్టీ విషయంలో మాత్రం నోరెత్తకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు. దీనికి ట్విట్టర్ వేదికగా ఆయన సమాధానమిచ్చాడు. ఈ విషయంపై తాను చర్చించడం మొదలుపెడితే మొదటికే మోసం వచ్చి గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నాడు.

"దేశ భక్తులైన నెటిజన్లు ఎవరైనా వస్తు సేవల పన్ను పాత్ర, దాని అవసరం ఎంత ఉందన్న విషయమై సమగ్ర అధ్యయనం చేశారా?" అని ట్విట్టర్ లో ఆయన ఓ ప్రశ్న ఉంచగా, ఓ ఫాలోవర్, బిల్లుపై మీ అభిప్రాయాలను ఎందుకు చెప్పలేదని ఎదురు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా "నా ఆర్థిక శాస్త్ర ప్రావీణ్యంతో మాట్లాడితే, పార్టీ విధేయత కోల్పోతాను. అది ఘర్షణలకు, లేనిపోని వివాదాలకూ తావిస్తుంది" అని చెబుతూ, తన అభిప్రాయం బీజేపీ అధిష్ఠానం నొచ్చుకునేలా ఉంటుందని చెప్పకనే చెప్పారు. జీడీపీ పెరిగేందుకు జీఎస్టీ మార్గం కాదని, అధిక పెట్టుబడులు, కార్మిక ఉత్పాదకత, నైపుణ్య వృద్ధి మాత్రమే అవసరమని తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subramanian swamy  twitter  GST bill  

Other Articles