BJP demands Uttarakhand CM Harish Rawat’s resignation over rape victim’s allegation

Bjp pressurised rape victim to change stance alleges harish rawat

harak singh rawat, former uttarakhand minister, harak singh rawat accused of raping, delhi police, fir, south delhi incident, bjp, bjp minister, bjp minister harak singh rawat , rape, south delhi rape, uttarakhand, congress, congress government, delhi news, india news

Law should take its course and the real culprits behind the conspiracy should be brought to book, said BJP President Ajay Bhatt.

అది కాంగ్రెస్ మార్కు రాజకీయం: బీజేపి

Posted: 08/05/2016 07:14 AM IST
Bjp pressurised rape victim to change stance alleges harish rawat

ఉత్తరాఖండ్ రెబల్ ఎమ్మెల్యేల నేత, బీజేపి నేత హారక్ సింగ్ రావత్ పై కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయం చూపిందని అందుచేత వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. కుట్రలు చేసే వ్యక్తులకు అధికారంలో ఉండే హక్కు లేదని మండిపడింది. తమకు రెబల్ గా మారిన ఎమ్మెల్యేలపై పార్టీ కావాలని అణిచివేయాలని తప్పుడు కేసులు నమోదు చేస్తుందని బీజేపి అరోపించింది. బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే, అదే మహిళ ప్లేటు ఫిరాయించి తాను ముఖ్యమంత్రి రావత్ ఒత్తిడి చేస్తేనే అలా తప్పుడు కేసు పెట్టానంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. దీంతో బీజేపీ నేతలు రావత్ రాజీనామాకు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 'హరీశ్ రావత్కు అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయాడు. ఒక మహిళను బెదిరించి, ఆమెను కష్టాలుపాలు చేస్తామని హెచ్చరించి తప్పుడు కేసు పెట్టించారు. అలాంటి వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే హక్కు ఏమాత్రం లేదు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ అన్నారు.

కాగా అత్యాచారా బాధితురాలిపై బీజేపి నేతలు ఒత్తిడి చేయడం మూలంగానే అమె దిక్కుతోచని స్థితిలో తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అరోపిస్తున్నాయి. బాధితురాలిపై ఒత్తిడి చేసి కేసు పెట్టించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ఆ వర్గాలు తప్పికోట్టాయి. అయితే 15 ఏళ్ల క్రితం ఆయన కాంగ్రెస్ నేతగా వున్నప్పుడు కూడా కాంగ్రెస్ బాధితురాలితో కేసులు ఎలా పెట్టిస్తుందని వాదిస్తున్నారు. బీజేపి నేతలు తమ నేతను కాపాడుకునేందుకు దిగజారుడు ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తిప్పికోడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harak singh rawat  harish rawat  rape victim  bjp  congress  uttarakhand  

Other Articles