హోదాపై నెల్లూరు యువభేరీలో జగన్ ఫైర్ | Jagan fire on chandrababu over status in Nellore Yuvabheri

Jagan fire on chandrababu over status in nellore yuvabheri

Jagan fire on chandrababu, Jagan about special status, Jagan in nellore Yuvabheri, Jagan about chandrababu birth,

Jagan fire on chandrababu over status in Nellore Yuvabheri.

బాబు పుట్టుకపై జగన్ కామెంట్లు

Posted: 08/04/2016 03:15 PM IST
Jagan fire on chandrababu over status in nellore yuvabheri

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షనేత, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పై చేయి సాధించడం ఇప్పట్లో సాధ్యం అయ్యేది కాదని తెలిసిందే. కానీ, వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలకు వెనకాడకపోవటం జగన్ కి ఉన్న విశిష్ట లక్షణం. ఆ మధ్య రైతు భరోసా యాత్ర సందర్భంగా చెప్పు, చీపుళ్లతో కొట్టడంటూ పిలుపునివ్వటం పెను దుమారానికే దారితీసింది. టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడగా, పలువురు రాజకీయ విశ్లేషకులు జగన్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటు అభిప్రాయపడ్డారు.

అయితే హోదా లాంటి కీలక అంశంలో కూడా చంద్రబాబు మెతక తత్వం ప్రదర్శించడం ఇప్పడు ఏపీ ప్రజలకు సైతం రుచించడం లేదు. మరి ఇంతటి వజ్రాయుధాన్ని జగన్ వదిలేసుకుంటాడా చెప్పండి. దీనికి తోడు పలు ప్రజా సమస్యలను కలుపుకుని మరీ చంద్రబాబును ఏస్కున్నాడు. ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల మద్ధతు కూడగట్టే పనిలో పడిన జగన్, నెల్లూరులోని శ్రీ కస్తూరి దేవి గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన ‘యువభేరీ’ కార్యక్రమంలో చంద్రబాబు కాస్త సైటైరిక్ గా వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిషోళ్ల కాలంలో చంద్రబాబునాయుడు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

స్వాతంత్ర్య సమరయోధ కాలంలో బాబు పుట్టకపోవటం మన దేశం చేసుకున్న అదృష్టం. ఒకవేళ పుట్టి ఉంటే ఈ పోరాటం ఎందుకు బ్రిటిష్ వాళ్లు ఇచ్చినప్పుడే స్వాతంత్ర్యం తీసుకుందామని అని ఉండేవారని ఛలోక్తులు విసిరాడు. స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అని కూడా ఆయన ప్రశ్నించేవారంట.

మనం ఏనాడో చేసుకున్న కర్మకి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటున్నారని, జాబు.. బాబు... నినాదంతో అధికారంలోకి వచ్చాక చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక మరింత కష్టాలు అనుభవిస్తున్నారని ప్రసంగించాడు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి చేతకాని వాడిలా చూస్తు ఉన్నాడే తప్పించి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం మచ్చుకైనా చేయటం లేదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS agan  Nellore Yuvabheri  Chandrababu  fire  

Other Articles