బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ పై అఖిలేష్ సీరియస్ | UP CM Akhilesh Yadav serious on Bulandshahr gangrape

Up cm akhilesh yadav serious on bulandshahr gangrape

Bulandshahr gangrape, mother and daughter gangrape, rob and gang rape, UP CM Akhilesh Yadav on Bulandshahr gangrape

UP CM Akhilesh Yadav serious on Bulandshahr mother and daughter gangrape. Five police officials suspended for negligence.

బులంద్‌షహర్ : తల్లికూతుళ్ల గ్యాంగ్ రేప్ పై అఖిలేష్ సీరియస్

Posted: 08/01/2016 07:27 AM IST
Up cm akhilesh yadav serious on bulandshahr gangrape

తల్లికూతుళ్లపై కిరాతంగా జరిగిన గ్యాంగ్ రేప్ తో ఉత్తరప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం రాత్రి కారులో వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై దోస్త్‌పూర్ సమీపంలో అడ్డగించిన దుండగులు వారిని దోచుకున్నారు. అనంతరం పురుషుల కాళ్లు, చేతులు కట్టేసి 35 ఏళ్ల మహిళను, ఆమె 13 ఏళ్ల కుమార్తెను ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు.

ఈ ఘటనపై తీవ్రఎత్తున విమర్శలు రావటంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. ‘‘నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో డీజీపీ కూడా చాలా కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని సీఎం అఖిలేష్ పేర్కొన్నారు.

కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బులందర్‌షహర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను, మరో ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రధాన నిందితుడిని గుర్తించినట్టు డీజీపీ జావీద్ తెలిపారు. అలాగే మొత్తం 15మంది అనుమానితులను అదుపులోకి విచారించిన పోలీసుల, ముగ్గురు అనుమానితులు నరేశ్(25), బబ్లూ(22), రాయస్(28)లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని హోంకార్యదర్శి తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే బులందర్‌షర్‌లో అది కూడా రద్దీ ఎక్కువగా ఉండే రహదారి ప్రాంతంలోనే జరగడంతో పెను కలకలమే రేగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bulandshahr  gangrape  UP CM  Akhilesh Yadav  

Other Articles