Rape case filed against Uttarakhand BJP leader Harak Singh Rawat

Bjp alleges conspiracy behind rape case against harak singh rawat

harak singh rawat, harak singh rawat rape case, harak singh rawat rape, bjp harak singh rawat rape, bjp leader rape case, india news

A rape case has been filed against Uttarakhand BJP leader Harak Singh Rawat on the complaint of a woman at Safdarjung police station in South Delhi.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు

Posted: 07/30/2016 07:08 PM IST
Bjp alleges conspiracy behind rape case against harak singh rawat

భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులకు ఏమైందో తెలియదు.. అదికారం తమదని తమకు చట్టాలు చుట్టాలని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ, రైలు ప్రయానంలో బీహార్ ఎమ్మెల్సీ ఓ మైనర్ బాలిక పట్ల అనుచితంగా వ్యవహరించి లైంగికదాడికి పాల్పడటంతో.. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారం రోజులు కూడా తిరగకముందే ఉత్తరాఖండ్ కు చెందిన మరో బీజేపి నేత అదే తరహాలో అత్యాచారం కేసులో ఇరుక్కున్నారు. ఉద్యోగం పేరుతో ఇంటికి పిలిపించుకుని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే తనను రేప్ చేశాడని ఓ మహిళ దక్షిణ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్‌పై ఈ మేరకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసోంకు చెందిన 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై రేప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హరక్‌ తనను లైంగికంగా వేధించి.. అత్యాచారం చేసినట్టు మహిళ ఫిర్యాదు చేయడంతో సఫ్దర్‌జంగ్‌ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అలాగే ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. విజయ బహుగుణ, హరీష్ రావత్ కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన హరాక్ సింగ్ రావత్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల్లో ముఖ్యుడు.

ఇటీవల ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు లేవదీయడంలో హరక్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. రావత్‌ వ్యతిరేక రెబల్‌ ఎమ్మెల్యేలకు ఆయన నేతృత్వం వహించారు. ఆయన తిరుగుబాటుతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం.. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన బీజేపీ గూటికి చేరారు. ఆయనతోపాటు రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు.

అయితే హరక్ సింగ్ రావత్ పై గతంలోనూ ఇలాంటి అరోపణలే వచ్చినా.. పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. 15 ఏళ్ల క్రితం తాను మైనర్ గా వున్నప్పుడు కూడా హారక్ సింగ్ పై ఇదే తరహాల పిర్యాదు చేసిందని సమాచారం. 2003 లోనూ ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ యువతి ఆయపై పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే ఈ కేసుల విచారణ పై సమాచారం తెలియదు, కాగా బీజేపి మాత్రం హారక్ సింగ్ పై కక్ష పూరితంగా కేసులు బనాయించారని అరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand  Harak Singh Rawat  Delhi Police  Rape case  crime  

Other Articles