మిస్ ఫైర్ తో సీఎం కేసీఆర్ సెక్యూరిటీ మృతి | CM KCR security vasudevareddy died in gun misfire

Cm kcr security vasudevareddy died in gun misfire

Moinabad gun misfire, CM KCR security vasudevareddy died, KCR security died, gun misfire in Telangana

CM KCR security vasudevareddy died in gun misfire.

ఫైరింగ్ లో సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి మృతి

Posted: 07/29/2016 09:17 AM IST
Cm kcr security vasudevareddy died in gun misfire

రంగారెడ్డి జిల్లా మొయినాబాదు శుక్రవారం ఉదయం గన్ ఫైర్ చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి చేతిలోని గన్ మిస్ ఫైర్ కావటంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కానిస్టేబళ్లకు గాయాలయ్యాయి.

ఫైరింగ్ రేంజ్ లోని ఇండోర్ గ్రౌండ్ లో లో తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో వాసుదేవరెడ్డి చేతిలోని తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకువచ్చింది. ఈ బుల్లెట్ గాయం కారణంగా వాసుదేవరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. మిస్ ఫైర్ లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అధికారులు ఈ విషయానికి సంబంధించి గోప్యత పాటించడంతో వాసుదేవరెడ్డి మరణం వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వివరాలు వెల్లడించేందుకు ఇంటలిజెన్స్ వర్గాలు నిరాకరించడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  security official  Moinabad  gun  misfire  vasudeva reddy  

Other Articles