Strike by 10 lakh bankers to hit operations today

Bank strike to hit operations today

Indian banks, 10 lakh employees, bank employees, central government, banking policies, All India Bank Employees Association, banking news

Banking operations across India will be impacted today, as around 10 lakh employees of 40 private and state-run banks will strike work to protest the central government's banking policies

స్థంభించనున్న బ్యాంకు కార్యకలాపాలు.. సమ్మెలో ఉద్యోగులు

Posted: 07/29/2016 08:38 AM IST
Bank strike to hit operations today

దేశవ్యాప్తంగా ఇవాళ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల ఉద్యోగులు దేశవ్యాప్తంగా  సమ్మెకు దిగనున్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు మొత్తం 40 పైగా ప్రభుత్వ రంగ, పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఆయా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. పరిస్థితి తీవ్రతను అన్ని వర్గాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సమ్మె తలపెట్టినట్లు సమాచారం. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర కొత్త తరం బ్యాంకులు యథాప్రకారం పనిచేయనున్నాయి.

కీలకమైన తొమ్మిది యూనియన్లలో సభ్యత్వమున్నవారంతా సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 80,000 పైచిలుకు శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు’ అని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంబాబు విమర్శించారు.

 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో అయిదు బ్యాంకుల విలీనాన్ని (ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్) ఆయా బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలైన వాటిని కూడా వ్యతిరేకిస్తూ యూనియన్లు ఈ నెల 12, 13న రెండు రోజుల స్ట్రయిక్ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా దాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian banks  10 lakh employees  bank employees  central government  banking policies  

Other Articles