ఎంసెట్ పేపర్ లీక్ లో క్రిమినల్ కేసు నమోదు | criminal case filed in Eamcet paper leak

Criminal case filed in eamcet paper leak

Telangana CID, Criminal case in EAMCET paper leak, Eamcet 2016 paper leak, arrests in Eamcet paper leak

Telanga CID filed criminal case in Eamcet paper leak.

ఆమె ర్యాంకుతోనే బండారం బయటపడింది

Posted: 07/26/2016 11:51 AM IST
Criminal case filed in eamcet paper leak

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ లీక్ వ్యవహారంలో సీఐడీ విచారణలో నమ్మలేని విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ నుంచే కశ్చన్ పేపర్లు లీక్ అయిందని తెలిసి అధికారులు షాక్ తిన్నారు . అంతేకాదు ఈ తతంగం వెనుక దయాకర్ అనే వ్యక్తి హస్తముందని గుర్తించారు.

దయాకర్ కుమార్ కూతురికి గతేడాది ఎంసెట్ పరీక్షలో 23 వేల ర్యాంకు రాగా, ఈ సంవత్సరం మాత్రం 13వ ర్యాంకు వచ్చింది. ఆమె యావరేజ్ స్టూడెంట్ అని తెలుసుకున్న అధికారులు ఎంక్వెరీ చేయగా మొత్తం డొంక అంతా కదిలింది. ఈమెతోసహా వరంగల్, ఖమ్మంకి చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థుల ర్యాంకులపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరంతా చదువులో అంతంత మాత్రంగా ఉన్నా టాప్ ర్యాంకులు రావటం, ప్రస్తుతం అంతా ఎక్కడున్నారో తెలీకపోవటంతో ఈ లీకేజీ బాగోతం వెనుక వీరే ఉండి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు.

ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఇద్దరు కాంట్రాక్టు లెక్చర్లను విచారిస్తున్నారు. కాగా, పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు రోజుల తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసీఆర్ సర్కారు ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు ఒక్కో విషయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  EAMCET  2016  paper leak  CID  

Other Articles