India Declares Pak 'No School-Going' Mission, Asks Staff Kids to Return

Don t send wards to pak schools india to diplomats

India, no school going mission, pakistan, Pakistan High Commission, school children, Gautam Bambawale, Indian High Commission, Islamabad, Indian diplomats, Indian government, Pakistan Foreign Office

India has declared Pakistan a "No School-Going Mission" and asked staff members at the High Commission in Islamabad to either return or send their school-going children back home.

పాక్ లోని భారత్ దౌత్యాధికారులకు భారత్ సంచలన అదేశాలు

Posted: 07/26/2016 10:15 AM IST
Don t send wards to pak schools india to diplomats

కాశ్మీర్ సమస్యను మళ్లీ రగిలించేందుకు పాకిస్థాన్ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలలోని వ్యక్తులతో పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాయాధి దేశాలు భారత్ పాకిస్థాన్ ల మధ్య కార్గిల్ నాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇక కాశ్మీర్ లో ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో ఉత్పన్నమైన పరిస్థితులను బూచిగా చూపుతూ అనేక కుట్రలకు తెరలేపింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ పై హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు నుంచి హఫీజ్ సయీద్, సిరాజ్ అల్ హకూన్ లాంటి చెంచాలతో క్షేత్రస్థాయి 'కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటం' చేయిస్తోంది.

ఈ క్రమంలోనే సిరాజ్ ఉల్ హకూన్ నేతృత్వంలోని జమాతే ఇస్లామి(జేఐ) సంస్థ భారత హై కమిషన్ కార్యాలయం(ఇస్లామాబాద్) ముట్టడికి పిలుపు నిచ్చింది. మరోవైపు హఫీజ్ కు చెందిన 'జమాత్ ఉల్ దవా' వైద్య బృందం ఒకటి ఇస్లామాబాద్ హై కమిషనర్ లో భారత వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో పాక్ రాజధానిలోని ఇండియన్ ఎంబసీ వద్ద ఉద్రక్తత నెలకొంది. పాకిస్థాన్ కావాలనే ఇస్లామాబాద్ లోని భారత్ హై కమీషన్ ను టార్గెట్ చేసిందని భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ లో 'నో స్కూల్ గోయింగ్ మిషన్'ను అమలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులెవరూ తమ పిల్లలను పాక్ లోని స్కూళ్లకు పంపకూడదని హై కమిషనర్ గౌతమ్ బంబావతేకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పిల్లలను వెంటనే ఇండియాకు పంపాలని ఉద్యోగులకు సూచించింది. తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో తప్ప విదేశాల్లోని భారత హై కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. సోమవారం నాటి నిర్ణయం భారత్- పాక్ మధ్య బలహీనమవుతోన్న సంబంధాలకు పరాకాష్ట అని పరిశీలకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian High Commission  Islamabad  Pakistan  India  No school going mission  Gautam Bambawale  

Other Articles