మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు | chandra babu naidu hint on cabinet reshuffle soon

Chandra babu naidu hint on cabinet reshuffle soon

AP CM Chandra Babu naidu, Chandra Babu naidu cabinet reshuffle, AP cabinet reshuffle,

AP CM Chandra Babu naidu hint on cabinet reshuffle soon.

చంద్రబాబు మాటతో మంత్రులకు చెమటలు

Posted: 07/21/2016 08:31 AM IST
Chandra babu naidu hint on cabinet reshuffle soon

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్విస్ట్ తో మంత్రుల్లో ఇప్పుడు టెన్షన్ పెరిగిపోయింది. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదని ఆయన కొందరు సన్నిహిత నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రెండేళ్లయినా మంత్రివర్గంలో మార్పు లేని అంశంను మంగళవారం విజయవాడలో జరిగిన భేటీలో కొందరు లేవనెత్తగా త్వరలో అది జరగబోతుందని చెప్పారంట.

‘‘ఇప్పుడు మంత్రివర్గంలో 20 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరో, ముగ్గురో రావడానికి అవకాశముంది. అందుచేత పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్యనేతలు సహా 25 మంది దాకా ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు కేబినెట్ విస్తరణ ప్రస్తావన తెచ్చారు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరలో (డిసెంబర్ లో) ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో గత కొంతకాలంగా కొందరి పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి కూడా. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేపడతారంటూ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు అడగలేకపోయారు. ఎప్పుడు జరుపుతామన్న విషయాన్ని మాత్రం దాటవేసి ఆశావహుల్లో ఉత్కంఠకు తెర తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Cabinet  Chandrababu Naidu  Ministers  reshuffle  

Other Articles