కబాలి రిలీజ్ పై రజనీకి నోటీసులు | petition filed against Kabali release in madras HC

Petition filed against kabali release in madras hc

Petition filed against Kabali,madras HC Kabali release

Petition filed against Kabali release in madras HC

కబాలికి బిగ్ ట్విస్ట్... రిలీజ్ పై రజనీకి నోటీసులు

Posted: 07/21/2016 08:11 AM IST
Petition filed against kabali release in madras hc

ఊహించని ట్విస్ట్. మరికొద్ది గంటల్లో కబాలి విడుదల కావాల్సి ఉండగా, మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. లింగా సినిమా పంపిణీదారులు కబాలి విడుదలను ఆపు చేయాలని పిటిషన్ వేయగా, మద్రాస్ హైకోర్టు కాసేపటి క్రితం విచారణకు స్వీకరించింది. అంతేకాదు హీరో రజనీ కాంత్ కు నోటీసులు జారీ చేసింది.

లింగా సినిమా నష్టాన్ని తర్వాతి సినిమాతో పూడుస్తామని గతంలో రజనీ, నిర్మాతలు చెప్పారని, కానీ, అలా చేయకుండానే ఇప్పుడు కబాలి విడుదల చేస్తున్నారని పంపిణీదారులు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా మంగళవారం సాయంత్రం అదే కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రజనీ సహా కలైపులి థానులకు నోటీసులు జారీ చేసింది.

అయితే కబాలి విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆయా థియేటర్లలో చాలా షోలకు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడుబోయాయి. దీంతో కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ పై సాయంత్రం కల్లా తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా, తాజా పరిణామంతో ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Madras HC  linga distributors  

Other Articles