నిర్లక్ష్యంగా రోడ్డుకు అడ్డంగా వచ్చాడు ఆపై... | Careless jaywalker causes mass pile-up in China cycle race

Careless jaywalker causes mass pile up in china cycle race

Careless jaywalker, causes mass pile-up, China cycle race, waiker china cycle race, cyclists fall down, cyclist serial fall, city of Xining, PEDESTRIAN CAUSES ACCIDENT, QINGHAI cycle race, CHINA

Careless jaywalker causes mass pile-up in China cycle race.

ITEMVIDEOS:రోడ్డు దాటి వంద మందిని పడేశాడు

Posted: 07/21/2016 07:06 AM IST
Careless jaywalker causes mass pile up in china cycle race

రోడ్డు దాటుతుండగా ఏమరుపాటుగా ఉండటంతో ఆరు ప్రాణాలు ఇప్పుడు చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడేలా చేసింది. అలా అని అతను ఏ యాక్సిడెంట్ చేశాడనుకుంటే పొరపాటే. కానీ, యాక్సిడెంటల్ గా వంద మంది కుప్పకూలేలా చేశాడు. చైనాలో జరిగిన ఈ విచిత్రమైన ప్రమాదం వివరాళ్లోకి వెళ్లితే...

చైనాలో ప్రతి ఏటా నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద సైక్లింగ్ పోటీ 'ది టూర్ ఆఫ్ క్వింజాయ్' కెన్సింగ్ సిటీలో ఈనెల 17న‌ ఘ‌నంగా ప్రారంభ‌మ‌యింది. ప్రపంచం నలుమూలల నుంచి వ‌చ్చిన సైక్లిస్టులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. 15 రోజులపాటు జరిగే ఈ పోటీలో సైక్లిస్టులు 3,630 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి. ఇందుకోసం కెన్సింగ్ సిటీలో సైక్లిస్టుల‌ ర్యాలీ కోసం ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే, సైక్లిస్టులు ఓ జంక్షన్ వద్దకు చేరుకుంటోన్న స‌మ‌యంలో ఓ పాదచారి పొర‌పాటున వారికి అడ్డంగా వ‌చ్చేశాడు.

 

సైక్లిస్టుల‌ను గ‌మ‌నించ‌కుండా రోడ్డు దాటుతూ ఉన్నాడు. సైక్లిస్టుల్లో ముందుగా వ‌స్తోన్న వారు ఆ పాద‌చారిని ఢీ కొట్టారు. దీంతో వారి వెన‌క‌వ‌స్తోన్న సైక్లిస్టులు ముందుగా వెళుతోన్న సైక్లిస్టుల‌ని ఢీ కొట్టారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు సైకిళ్లతో స‌హా కింద‌ప‌డి పోయి సైక్లిస్టులు ఓ కుప్పలా క‌నిపించారు. ప‌దిహేను మంది సైక్లిస్టుల‌కి తీవ్రగాయాల‌య్యాయి, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చేసేది లేక వారిని తప్పించి, పోటీ కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన పాద‌చారిని పోలీసులు అరెస్టు చేశారు. తాను సైక్లిస్టుల‌ని గ‌మ‌నించ‌లేద‌ని స‌ద‌రు పాద‌చారి చెబుతుండగా, అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  city of Xining  jaywalker  cycle race  accident  QINGHAI BIKE RACE  

Other Articles