కాషాయానికి కమలం కష్టాలు? | PIL accepted by Bombay HC against BJP on lotus symbol

Pil accepted by bombay hc against bjp on lotus symbol

BJP Lotus symbol troubles, Lotus for BJP, PIL against BJP for Lotus

PIL accepted by Bombay HC against BJP on lotus symbol.

కాషాయానికి కమలం కష్టాలు?

Posted: 07/08/2016 08:29 AM IST
Pil accepted by bombay hc against bjp on lotus symbol

మన దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది? బీజేపీ అని చిన్నపిల్లాడైన టక్కున చెప్పేస్తాడు. మరీ దాని గుర్తు... ఇది మరీ టూమచ్ కాషాయంలో కమలం ఇదైనా ఎవరైనా తేలిగ్గా చెప్పేస్తారు అంటారా?. కావొచ్చు కానీ, భవిష్యత్తులో అది మారే సంకేతాలు ఉన్నాయనే చెప్పొచ్చు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీకి అర్థాంతరంగా అంత అవసరం ఏం వచ్చిందనేగా....

‘జన సంఘ్’గా చిన్న కాలువలా ప్రయాణం మొదలెట్టి ఆ తర్వాత ‘భారతీయ జనతా పార్టీ’గా రూపాంతరం చెందిన ఈ పార్టీ అనతికాలంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కేంద్రంలోనే కాక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బలమైన పార్టీగా ఆవిర్భవించింది. అసలు జాతీయ పార్టీల్లో వామపక్ష పార్టీలను తోజేసి మరీ కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం ఆక్రమించింది కమలం. అలాంటి పార్టీకి ఇప్పుడు చిహ్నంతోనే పెద్ద చిక్కు వచ్చి వచ్చిపడింది.బీజేపీకి అసలు ‘కమలం’ గుర్తు ఎలా కేటాయించారంటూ సామాజిక ఉద్యమకర్త హేమంత్ పాటిల్ బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు.

జాతీయ చిహ్నంగా ఉన్న ‘కమలం’ ను రాజకీయ పార్టీకి కట్టబెట్టడం సరైందని కాదని అందులో ఆయన ఉద్దేశ్యం. అంతేకాదు కమలం’ గుర్తును ఎన్నికల చిహ్నంగా వాడుకుంటూ బీజేపీ ‘‘ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (ప్రివెన్షన్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 1950’ ఉల్లంఘిస్తోందని కూడా పాటిల్ ఆరోపిస్తున్నారు. కావాలంటే ఇంకో గుర్తును ఆ పార్టీకి కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన బాంబే హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వచ్చే వారం విచారణ చేపట్టనుంది. 25 ఏళ్ల క్రితం ఎన్నికల కమిషన్ దానికి కమలం గుర్తుగా కేటాయించింది. అయితే ఇందులో బీజేపీకి పెద్ద చిక్కులు ఎదురు కాకపోవచ్చనే న్యాయ నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Bombay HC  Hemant Patil  Lotus  National Flower  PIL  

Other Articles