Eating pasta helps you lose weight, says Italian study

Pasta not fattening italian study finds

pasta,Italy, IRCCS Neuromed Institute, George Pounis, Body Mass Index, fattening, russian dish, womenPasta, italian dishes, woman, fattening

If you cannot resist pasta, go order another red-sauced one as contrary to popular belief, eating pasta does not add fat but actually help shed extra kilos.

పాస్తా అందించెను.. మహిళలకు శుభవార్త..!

Posted: 07/07/2016 09:25 AM IST
Pasta not fattening italian study finds

ఇటాలియన్ ఫేమస్ వంటకమైన పాస్తా మీరు తింటున్నారా... అయితే పాస్తా ప్రేమికులకు, ముఖ్యంగా మహిళలకు ఇది  నిజంగానే శుభవార్త. పాస్తా తింటే ఊబకాయం రాదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాదు ఊబకాయం మన దరిచేరకుండా చేస్తుందని వెల్లడించారు. ఇటలీ సంస్థ ఐఆర్‌సీసీఎస్ న్యూరోమెడ్ శాస్త్రవేత్తలు సుమారు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాస్తాను నిత్యం ఆహారంగా తీసుకునే వారు బరువు పెరగలేదని, వారిలో ఊబకాయ సమస్య కూడా తలెత్తలేదని శాస్త్రవేత్తల్లో ఒకరైనా జార్జ్ పునిస్ తెలిపారు.

పాస్తా తినేవారు ఆరోగ్యంగాను, సన్నని నడుముతోనూ ఉన్నారని పునిస్ పేర్కొన్నారు. బరువు పెరిగె అవకాశాలు ఉంటాయని అపోహపడి చాలా మంది మహిళలు పాస్తా అంటే ఎంతో ఇష్టం ఉన్నా, చాలా సందర్భాలలో నోరు కట్టేసుకుని ఉండాల్సి వస్తోంది. పాస్తా తింటే బరువు పెరుగుతామని చాలా మంది అపోహ పడతారని, అందులో నిజం లేదని ఐఆర్‌సీసీఎస్ పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో తేలిన విషయాలను ఇటీవల విడుదలైన న్యూట్రీషియన్, డయాబెటిస్ జర్నల్‌లో ఈ వివరాలను వెలువరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pasta  italian dishes  woman  fattening  

Other Articles