Chandrababu Naidu supports call money indirectly

Chandrababu naidu supports call money indirectly

AP, Call Money, Chandrababu Naidu, call money, call money in ap, Chandrababu Naidu on call money, Chandrababu, call money in Vijayawada

AP CM Chandrababu Naidu indirectly suppots call money in ap. He didnt talk even single word on call money issue.

కాల్ మనీ కాలనాగులకు బాబు ప్రభుత్వం అండ

Posted: 12/16/2015 10:09 PM IST
Chandrababu naidu supports call money indirectly

కాసుల కోసం కాపురాలను కూల్చేస్తారు.. అదే కాసుల కోసం మానాలను, అవసరమైతే ప్రాణాలను కూడా బలిగొంటారు.. అలా అతి కిరాతకంగా వ్యాపారం చేస్తున్న కాల్ మనీ వ్యవహారం మీద ఏపిలో పెద్ద దుమారమే నడుస్తోంది. ఎంతో మంది ఆడవాళ్ల శీలాలకు, మరెంతో మంది ప్రాణాలను పణంగా పెడుతూ సాగిన కాల్ మనీ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వడ్డీ వ్యాపారం మాటున సాగుతున్న అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వేగంగా సాగుతున్న కాల్ మనీ విచారణపై అలుముకున్న నీలి నీడలు పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడు సర్కార్ కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తోందా అన్న దాని మీద సర్వత్రా చర్చ సాగుతోంది.

Also Read: కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..? 
Also Read: చంద్రబాబుకు బ్యాడ్ టైం.. కారణం అదే 

విజయావాడ కేంద్రంగా సాగింది అని అనుకుంటున్న వారికి కాల్ మనీ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడలోనే కాకుండా కృష్ణా జిల్లా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కూడా కాల్ మనీ విస్తరించి ఉంది. అయితే ఆడవాళ్ల మానాలతో, వారి ఆస్తులతో ఆడుకున్న కాలాంతకులకు తగిన శిక్ష వేస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కాల్ మనీ కాలాంతకులను కాపాడేటట్లే కనిపిస్తున్నాయి.

Also Read: కాల్ మనీ వివాదంపై కదిలిన జనసేన 
Also Read: కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..! 

కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటంతో చివరకు చంద్రబాబు మెడకే ఉచ్చుబిగుస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడుకునే క్రమంలో చంద్రబాబు సర్కార్ కావాలనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విజయవాడ కమీషనర్ ను సెలవు మీద పంపిస్తున్నట్లు వార్తలు రావడం. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తన సెలవును రద్దు చేసుకుంటున్నానని ప్రకటించారు. అయితే ఇంత నాటకాలు ఎందుకు అంటే చంద్రబాబు ఎందుకు ఆడవుతున్నారు అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తన వాళ్లను కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles