Janasena party protest on call money in ap

Janasena party protest on call money in ap

Janasena, Pawan Kalyans Janasena, Vijayawada, Call Money, Janasena on call money, Janasena Protest

Janasena party leaders protest in Vijayawada kaleshwari market. Janasena leaders demand to punish the call money accusers.

కాల్ మనీ వివాదంపై కదిలిన జనసేన

Posted: 12/16/2015 01:32 PM IST
Janasena party protest on call money in ap

ఏపిలో తీవ్ర సంచలనానికి తెర తీసిన కాల్ మనీ వ్యవహారంలో అన్ని పక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే పార్టీ పెట్టింది.. పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ తన అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ మాటను జనసేన కార్యకర్తలు పాటిస్తున్నారు. తాజాగా కాల్ మనీపై నిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తూ.. తాజాగా విజయవాడలో ఆందోళన నిర్వహించారు. అవసరమైనప్పడు ఏ అంశంలో అయినా తాను ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గతంలోనే వెల్లడించారు. అయితే రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి కారణమైన కాల్ మనీపై జనసేన కూడా ముందుకు వచ్చింది. విజయవాడ కాళేశ్వర మార్కెట్ వద్ద జనసేన కార్యకర్తలు తాజాగా ఆందోళనకు దిగారు.

Also Read: ప్రేమతో తల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు లెటర్ 
Also Read: పవన్ కళ్యాణ్ కు మీడియా కవరేజ్ ఎందుకు..?

కాల్ మనీ ముసుగులో ఆడవాళ్ల మానాలతో వ్యాపారం నిర్వహించిన.. నిర్వాహకులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేందుకు అవకాశ: ఇవ్వకూడదని ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు గళమెత్తాయి. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా ఆందోళనకు దిగడం తెలుగు తమ్ముళ్లకు గుబులుపుట్టిస్తోంది. గతంలో పవన్ అమరావతి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించారు.. అలాగే బాక్సైట్ కేటాయింపుల మీద కూడా తన గళాన్ని గట్టిగా వినిపించారు. అయితే మరోసారి కాల్ మనీ విషయంలో జనసేన నుండి తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles