chandrababu Naidu trying to save call money Abusers

Chandrababu naidu trying to save call money abusers

call money, chandrababu Naidu, AP, Vijayawada, call money scam, Chandrababu naidu on call money

AP cm chandrababu Naidu may trying to save call money abusers. Recently a news came out that Vijayawada commissinor Gowtham Sawang taking leave for some days

కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..?

Posted: 12/15/2015 05:48 PM IST
Chandrababu naidu trying to save call money abusers

కాల్ మనీ.. రాష్ట్రంలో సంచలనానికి తెర తీసింది. ఓ వైపు డబ్బులు, డబ్బుల మాటలు ఆడవాళ్లతో తోలు వ్యాపారం చేయిస్తున్న కాలాంతకులకు శిక్ష పడుతుందా అన్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్లు కనిపించడం లేదు. ఏపిలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆడవాళ్ల మానాలతో, వారి ఆస్తులతో ఆడుకున్న కాలాంతకులకు తగిన శిక్ష వేస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కాల్ మనీ కాలాంతకులను కాపాడేటట్లే కనిపిస్తున్నాయి.

విజయవాడ కేంద్రంగా, పలు మేజర్ నగరాల్లో చోటుచేసుకున్న కాల్ మనీ వ్యవహారం వికృత క్రీడ బయటకు వచ్చింది. కాల్ మనీ పేరుతో చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాల్ మనీ బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు, పోలీసుల ముందుకు వస్తున్నారు.అయితే కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటంతో చివరకు చంద్రబాబు మెడకే ఉచ్చుబిగుస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడుకునే క్రమంలో చంద్రబాబు సర్కార్ కావాలనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా విజయవాడ కమీషనర్, కాల్ మనీ కేసును వేగంగా విచారిస్తున్న గౌతమ్ సవాంగ్ ను సెలవుపై ఎందుకు పంపిస్తున్నారు అన్నది ప్రశ్న. ఎందుకంటే కాల్ మనీ కేసు కీలక దశలో ఇలా నిజాయితీగా పని చేస్తున్న పోలీస్ అధికారిని సెలవు మీద పంపించడం ఏంటని.. దాని మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే గౌతమ్ సవాంగ్ చాలా రోజుల క్రితమే సెలవు కొసం వినతి పెట్టుకున్నారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కానీ అంత అర్జంట్ గా కమీషనర్ ను ఎందుకు సెలవు మీద పంపుతున్నారని చంద్రబాబు నాయుడు మీద విమర్శలకు తావిస్తున్నారు. అయితే కాల్ మనీ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారని.. కేసు విచారణ నిఖచ్చిగా జరిగితే తమ పార్టీ నాయకుల బండారమే బయటపడుతుందని.. అది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు కావాలనే కేసును తొక్కిపెడుతున్నారని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిజమే అనిపిస్తోంది అందుకే కమీషనర్ ను ఆగమేఘాల మీద సెలవు మీద పంపించేస్తున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles