Chandrababu facing hard times in assembly sessions

Chandrababu facing hard times in assembly sessions

Chandrababu Naidu, Chandrababu, Assembly, AP Assembly sessions, Call Money, Cheap Liquior Mafia, Jagan

Chandrababu facing hard times in assembly sessions. AP CM Chandrababu naidu may face oppositions protest in assembly sessions.

చంద్రబాబుకు అసెంబ్లీలో చుక్కలే

Posted: 12/17/2015 08:08 AM IST
Chandrababu facing hard times in assembly sessions

ఏపి అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో మొదలుకానున్నాయి. గత కొంత కాలంగా ఏపిలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. వరుస పెట్టి వివాదాలు చోటుచేసుకోవడంతో చంద్రబాబు సర్కార్ ను అసెంబ్లీలో నిలదీయాలని ప్రతిపక్షాలు అంతా సిద్దమయ్యాయి. ఈ నెల 22 వరకు జరిగే సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద అన్ని రకాల సమస్యల మీద విరుచుకుపడాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. అయితే ప్రతిపక్షాల దాడిని ఎలా తిప్పి కొట్టాలన్న దాని మీద ప్రభుత్వం కూడా తర్జన భర్జన పడుతోంది. అయినా చంద్రబాబు నాయుడు అండ్ ఆయన ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ సమావేశాలు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు.

ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు అన్ని సమస్యలు చంద్రబాబు నాయుడు మీద విమర్శలకు తావిస్తోంది. బాక్సైట్ వ్యవహారం నుండి కల్తీ మద్యం, తాజాగా కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వాన్ని తీవ్ర కష్టాల సుడిగుండంలో నెట్టేశాయి. అమాయకుల ప్రాణాలను హరించిన కల్తీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇక తాజాగా కాల్ మనీ వ్యవహారం గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిడం.. విజయవాడ సిపి సెలవు.. తర్వాత దాన్ని విరమించుకోవడం ఇలా అన్నింటా చంద్రబాబును ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టనున్నాయి. ముఖ్యంగా జగన్ అండ్ కో చంద్రబాబు మీద మాటల యుద్దానికి సిద్దంగా ఉన్నారు. మరి చూడాలి అసెంబ్లీలో ఏం జరుగుతుందో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles