Indian Isis fighter was influenced by Akbaruddin Owaisis speeches

Indian isis fighter was influenced by akbaruddin owaisis speeches

ISIS, Terrorist, Akbaruddin Owisi, Owisis speech, AKbaruddin Owiss speech, AKbaruddin speech about muslims, MIM, Hyderabad, Areeb Majeed

Areeb Majeed, the Kalyan youth who was among the first Indians to fight for Isis, has revealed to interrogators in Mumbai that AIMIM leader and Telagana MLA Akbaruddin Owaisi was among the people whose speeches influenced him. Majeed and three of his friends from Kalyan, Mumbai, had fled to Iraq to join the Islamic State last May, but he was the only one to return to India and is currently lodged at Arthur Road Jail in Mumbai.

అక్బరుద్దీన్ ఓవైసీ మాటల వల్ల ఉగ్రవాదిగా..

Posted: 11/18/2015 10:07 AM IST
Indian isis fighter was influenced by akbaruddin owaisis speeches

ఉగ్రవాదులు ఎంతటా భయానక సరిస్థితినైనా ఎదుర్కొంటారు.. తమ ప్రాణాలను లెక్కచెయ్యకుండా ఎదుటి వారి ప్రాణాలను బలిగొంటారు. అయితే చాలా ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యేది రెచ్చగొట్టే ప్రసంగాలతోనే.. అవును ఉగ్రవాద కీలక నాయకులు చేసే ప్రసంగాలు ఎంతటి మారణహోమానికైనా మనిషిని సిద్దం చేస్తాయి. అయితే తాజాగా ఓ ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తాను హైదరాబాద్ ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ప్రసంగాల వల్లే జిహాదీగా మారినట్లు వెల్లడించారు. పార్టీల ముసుగులో అక్భరుద్దీన్ చేసేని ప్రసంగాల కారణంగానే తాను జిహాదీగా.. ఉగ్రవాదిగా మారినట్లు ఉగ్రవాది చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also Read: అసదుద్దీన్ ఓవైసీకి పోలీసుల ఝలక్ 

ఎంఐఎం నేత, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాల ప్రభావంతో తాను జిహాదీనయ్యానని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అరీబ్ మజీద్ చెప్పినట్లు అతడి ఇంటరాగేషన్ నివేదిక వెల్లడించింది. అక్బరుద్దీన్ ప్రసంగాలన్నీ యూ ట్యూబ్ ద్వారా వినేవాడినని, వాటితోబాటు పలు ఈ-బుక్స్ కూడా చదివానని అరీబ్ చెప్పినట్లు తెలిసింది. సౌదీ అరేబియాకు చెందిన ముహ్మద్ అల్ ఆరిఫి, ఆస్ట్రేలియాకు చెందిన మొహ్మద్ హొబ్లోస్, పాకిస్థాన్‌కు చెందిన షేక్ అబ్దుల్లా అజ్జామ్‌ల ప్రసంగాలు కూడా విని స్ఫూర్తి పొందేవాడినని మజీద్ వెల్లడించినట్లు సమాచారం. ముంబై కళ్యాణ్ ప్రాంతం నుంచి ఇరాక్ సిరియా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసిపోయాడు. సోషల్ మీడియా సాయంతో కూడా ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాదులతో చేతులు కలిపేలా అరీబ్ మజీద్‌ యువతను ప్రోత్సహించాడు. ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు తీవ్రం కావడంతో ఆరు నెలల తర్వాత భారత్‌కు తిరిగివచ్చిన అరీబ్ మజీద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles