Tear gas fired inside and outside Kosovo parliament

Tear gas fired inside and outside kosovo parliament

Kosovo , Parliament , riot zone, Parliament war, Pepper spray in Parliament, MPs fighting in Parliament

Opposition lawmakers in Kosovo fired tear gas and pepper spray in parliament on Tuesday and police clashed with rock-throwing protesters in a deepening political crisis over relations with former master Serbia.Protesters threw rocks, bottles and petrol bombs at police and parliament in the capital, Pristina, rallying in support of opposition lawmakers who for a fourth time disrupted the work of the assembly with tear gas and, on this occasion, pepper spray.

పార్లమెంట్ లో టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే

Posted: 11/18/2015 08:08 AM IST
Tear gas fired inside and outside kosovo parliament

పార్లమెంట్ లో భీభత్సాన్ని సృష్టించడం చూశాం.. పార్లమెంట్ లో సభ్యులు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతున్న వార్తలను చూశాం. ఇక తాజాగా పార్లమెంట్ భవనాన్ని అదేదో యుద్దం చేసే ప్రాంతంలా తయారు చేశారు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు.  కొసావో దేశ పార్లమెంట్ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారపక్షం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం సమావేశాలను అడుగడుగునా అడ్డుకుంటుంది. సెర్బ్ కమ్యూనిటీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం. అదేవిధంగా మాంటీనిగ్రోతో చేసుకున్న సరిహద్దు ఒప్పందాలను రద్దు చెయ్యాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.

గడిచిన రెండు నెలలుగా పార్లమెంట్ సమావేశాల పనితీరు ఈ విధంగానే నడుస్తోంది. ఈ క్రమంలో భాగంగా నేడు తలపెట్టిన నిరసనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో టియర్ గ్యాస్‌ను, పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ప్రతిపక్ష నేత అల్‌బిన్ కుర్తి మంత్రులపై పెప్పర్ స్ప్రేను చల్లాడు. పార్లమెంట్ ప్రధాన హాలును బలవంతంగా ఖాళీ చేయించాడు. పార్లమెంట్ వెలుపల పహారా కాస్తున్న పోలీసు సిబ్బంది సైతం తమపై జరుగుతున్న రాళ్లదాడిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. యూరోప్‌లోని కొసావో 2008లో సెర్బియా నుంచి విడిపోయి స్వాతంత్య్రం పొందింది. కాగా కొసావో సార్వభౌమత్వాన్ని సెర్బియా అంగీకరించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles