Shooting in North Paris During Police Operation

Shooting in north paris during police operation

Paris, Paris attack, Paris Shooting, Paris Terror Attack, Paris Police, Paris anti-terrorist police operation, Shooting in North Paris

Shooting broke out in a northern suburb of Paris during an anti-terrorist police operation, sources said Wednesday, five days after the worst attacks in French history killed 129 people in the capital. There was an exchange of gunfire during the operation in Saint-Denis, according to a source close to the investigation, who could not confirm who was targeted in the operation. Another source said a special armed response unit took part in the raid.

ప్యారిస్ లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు

Posted: 11/18/2015 10:52 AM IST
Shooting in north paris during police operation

ప్యారిస్ నగరంలో మరోసారి కలకలం రేపింది. గత శుక్రవారం రోజు ప్యారిస్ నగరం మీద ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసి భీకర దాడి తర్వాత యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్యారిస్ లోని పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు తెగించడంతో దాదాపు 129 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరోసారి ప్యారిస్ లో తుపాకుల మోత మోగింది. పోలీసులు నిర్వహిస్తున్న సెర్చ్ లో ఉగ్రవాదుల సమాచారం అందడంతో కలకలం రేగింది. ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోందని..  తాజాగా సమాచారం ప్రకారం ఎంత మంది చనిపోయారు అన్నది చెప్పలేమని పోలీస్ శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది.

Also read: అక్బరుద్దీన్ ఓవైసీ మాటల వల్ల ఉగ్రవాదిగా..

ప్యారిస్ నగర శివారులోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగించినట్లు పోలీసులకు సమాచారం అందిందని.. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చెయ్యగా వెంటనే ఉగ్రవాదులు కూడా కాల్పులకు దిగారని కూడా వార్తలు వస్తున్నాయి. ప్యారిస్ లో జరిగిన దాడి తర్వాత ఫ్రాన్స్ లో చాలా మంది ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదులకు సహాయం చేసే వారు ఉన్నట్లు ఫ్రాన్స్ భద్రతా సిబ్బంది ముందు నుంచి అనుమానాలు వ్యకతం చేస్తోంది. దేశంలో అనుమాన ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలకు దిగాయి. అలాగే ప్యారిస్ దాడిలో మరి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles