Agra police didnt give permission to mim party meeting

aimim, mim, asadudin, owisi, agra, police, meeting

agra police didnt give permission to mim party meeting, mim party leaders commence to meeting on 29 th of this month at meena bazar of koti, agra. dist. police did not give permission to this meeting.

అసదుద్దీన్ ఓవైసీకి పోలీసుల ఝలక్

Posted: 03/21/2015 04:55 PM IST
Agra police didnt give permission to mim party meeting

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి మరో సారి పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఎంఐఎం పార్టీ ఈ నెల 29వ తేదీన ఆగ్రాలోని కోఠి మీనా బజార్ గ్రౌండ్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. ఈ సభ కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్న నిఘా విభాగం నివేదిక ఆధారంగా ఆగ్రా జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆగ్రాలో ఎంఐఎం బహిరంగ సభకు అనుమతి ఇవ్వవద్దని బజ్‌రంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్, హిందూ జాగరణ్ మంచ్ సంస్థలు ఇప్పటికే అధికారులకు మెమొరాండం అందించాయి. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎంఐఎం సభకు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ పరిణామంపై ఎంఐఎం ఆగ్రా జిల్లా శాఖ అధ్యక్షుడు ఇద్రిష్ అహ్మద్ స్పందిస్తూ తమ సభకు అనుమతి కోసం తామిచ్చిన అఫిడవిట్‌ను జిల్లా అధికారులు ఇప్పటికే స్వీకరించారన్నారు. కొన్ని సంస్థలు చేసిన తీవ్రమైన ఒత్తిళ్ళ వల్లే అధికార యంత్రాంగం వెనక్కి తగ్గిందని ఆరోపించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aimim  mim  asadudin  owisi  agra  police  meeting  

Other Articles