క్రీడారంగంలో మన ఆణిముత్యాలు మరోసారి మెరిశాయి. బ్యాడ్మింటన్ లో మన దేశ ప్రతిష్టలను ఎగరవేస్తున్న సైనా నెహ్వాల్ కు అరుదైన ఘనత దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో సైనా నెహ్వాల్ కు పద్మ భూషణ్ రావడం అభినందనీయం. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా సైనా నెహ్వాల్ అవతరించింది. ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ అవతరించినది.
సానియా మీర్జా సింగిల్, డబుల్స్ లో దూసుకెళుతూ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు రాసుకుంది. 2003లో ఆమె అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆమెకు 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది. తాజాగా పద్మ భూషణ్ కూడా అందుకోనుంది. 2015లో ఆమెకు ఖేల్ రత్న అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మార్టినా హింగిస్ తో కలిసి సానియా మీర్జా వరుసగా 6 టైటిళ్లు..29 విజయాలతో దూసుకెళ్లింది. మొత్తానికి క్రీడాలోకానికి మరింత కీర్తి గడించిన సైనా, సానియాలకు పద్మ భూషణ్ లు రావడం మనకు కూడా గర్వకారణమే.
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more