world-class tennis player stop his game to help a distressed ballgirl

Tsonga comes to aid of injured ballgirl

Frenchman Tennis player Jo-Wilfried Tsonga, Tsonga hailed for his kindness, Tsonga kindness, Tsonga ball girl, Tsonga, Tsonga appreciation, French open match Tsonga, Tsonga Omar Jasika, tennis, Australian Open, Jo-Wilfried Tsonga, Melbourne Park Tsonga

Frenchman Jo-Wilfried Tsonga was hailed for his kindness and consideration during his French Open match.

మానవత్వం పరిమళించే మంచి మనస్సున్న క్రీడాకారుడు సోంగా..!

Posted: 01/21/2016 06:49 PM IST
Tsonga comes to aid of injured ballgirl

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మానవత్వం వెల్లివిరిసింది. ప్రపంచ స్థాయి క్రీడాకారుడు. అందులోనూ అడుతున్నది గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. ఏ క్రీడాకారుడికైనా తన ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలన్న ఆలోచనలే మది నిండి వుంటాయి. ఆ సమయంలో దేని గురించి ఆలోచించకుండా ప్రత్యర్థికి విసురుతున్న బంతులు, అటు నుంచి వస్తున్న బంతులపైన దృష్టంతా కేంద్రీకరించి వుంటుంది. కానీ గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ టెన్నిస్ మ్యాచ్ లో కనబడే ఎప్పటికప్పుడు క్రీడాకారులకు బంతులను అందించే పనిలో నిమగ్నమైయ్యూ బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారు.

అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు.  ఈ తరహా సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఒక బాల్ గర్ల్స్అరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న సోంగా మ్యాచ్ నిర్వాహకుల అనుమతి తీసుకుని అమెను ఇంటికి పంపించడంతో అతని మంచి మనస్సు, మనస్సులోని మానవత్వం కూడా పరిమళించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా ఓమెర్ జాసికాతో మూడో సెట్ సందర్భంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు.

 దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి వేశాడు. దీంతో సోషల్ మీడియాలో సోంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజంగా ఒక జెంటిల్మన్ వ్యవహరించాడని టెన్నిస్ అభిమానులు కొనియాడారు. దీనిపై సోంగా స్పందిస్తూ.. ఆ అమ్మాయికి తాను చేసిన సాయం ఏమీ లేదంటూ తన ఉన్నతిని చాటుకున్నాడు. కేవలం స్టేడియం బయటకు పంపడం వరకూ మాత్రమే ఆమెకు సాయ పడ్డాడని తెలిపాడు. దీంతో మానవత్వం పరిమళించిన మంచి మనసుకు స్వాగతం అంటూ కూడా కామెంట్లు వెల్లివిసిరాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tsonga  australia open  ball girl  Omar Jasika  

Other Articles