Biography Of Singer Janaki Who is called as Nightingale of South India | Indian Film Industry

Singer janaki biography nightingale of south indian film industry

singer janaki biography, s janaki biography, singer janaki life story, singer janaki history, singer janaki photos, singer janaki updates, singer janaki songs, singer janaki life story, indian film industry, telugu film industry, kollywood news, telugu songs, janaki telugu song, janaki tamil songs, indian famous singers

Singer Janaki Biography Nightingale of South Indian Film Industry : The Biography Of Singer Janaki Who is called as Nightingale of South India. She sung above 50000 songs in different languages with different voices.

యాభైవేలకు పైగా పాటలతో మధురస్వరంతో అలరించిన గాయని

Posted: 04/29/2015 06:52 PM IST
Singer janaki biography nightingale of south indian film industry

‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి’.. ఈ సూత్రం చిత్రపరిశ్రమకు బాగానే సూటవుతుంది. ఎందుకంటే.. ఓ సినిమాను రూపొందించాలంటే తెరముందుండే నటీనటులు వుంటే సరిపోదు... తెరవెనుక ఎందరో కార్మికులు, కళాకారులు కూడా వుండాల్సిందే! అప్పుడే అది కూడా పరమళించిన పువ్వులాగా ఎంతో అందంగా వుంటుంది. అలా తెరవెనుక వుండే కళాకారుల్లో గాయకులది కూడా ప్రముఖపాత్రగానే వర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. సీదాసాదాగా నడిచే కథనం మధ్య వీరి గాత్రం ప్రేక్షకులను ఊహలపల్లకిలోకి తీసుకెళ్తుంది. అప్పటివరకు వుండే ప్రశాంతవాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. అలా భారతీయ ప్రేక్షకులను తమ మధురస్వరంతో మైమరిపించిన గాయకులు ఎందరో వున్నారు. అలాంటివారిలో ఎస్.జానకి ఒకరు! తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో కొన్నివేల పాటలు పాడిన ఈ నేపథ్యగాయని.. గాయకుల జాబితాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

జీవిత చరిత్ర :

1932 ఏప్రిల్ 23వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి - సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించింది. ఈమె తన బాల్యం నుంచే సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. పాటలపై వున్న మక్కువతో ఈమె ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. ఈమె ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి... తన మామయ్య సలహామేరకు 19వ ఏట చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించింది. ఇక అక్కడి నుంచి మద్రాసుకు మారి.. గాయనిగా అందనంత ఎత్తుకు ఎదిగింది.

గాయనిగా :

తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా కొనసాగిన ఈమె... 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘విధియిన్‌ విలాయత్తు’లో సినిమాలో మొదటిసారి పాట పాడింది. అప్పటినుంచి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఈమె.. ‘ఎమ్మెల్యే’ చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. అలాగే.. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక  భారతీయ భాషలలో పాటలు పాడింది. ఈమె తను పాడే పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించవచ్చా? అని ఆశ్చర్యపరిచేలా పాడిందంటే.. ఎంతటి ప్రతిభావంతురాలో అర్థం చేసుకోవచ్చు.

పండు ముసలావిడ గొంతు.. చిన్న పిల్లాడి గొంతు.. పెద్ద వాళ్ళ స్వరం.. ఇంకా రకరకాల గొంతులతో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించిన ప్రత్యేకత ఈ గాయకురాలిదే! సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది.

మరికొన్ని విషయాలు :

జానకి 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. అందులో ఎక్కువగా తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి.. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారాలు... 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. అలాగే మైసూరు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్... తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ పురస్కారం పొందారు. అయితే.. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని ఈమె 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singer janaki  indian famous singers  indian film industry  

Other Articles