Woman behind the abolishment of Devadasi system in Madras Presidency స్తీ జనోద్దరణకే జీవితం అకింతం చోడగం అమ్మన్నరాజా

Chodagam ammanna raja freedom fighter who untirily sturggled for welfare of women

Chodagam Ammanna Raja, Chodagam Ammanna Raja husband, Chodagam Ammanna Raja family, Chodagam Ammanna Raja gandham veerayya naidu, Chodagam Ammanna Raja Nagaratnamma, Chodagam Ammanna Raja Kaikaluru, Chodagam Ammanna Raja Bandar, Chodagam Ammanna Raja indian national congress, Chodagam Ammanna Raja feminist, Chodagam Ammanna Raja social activist, Chodagam Ammanna Raja biography, Chodagam Ammanna Raja history, Chodagam Ammanna Raja politics, Chodagam Ammanna Raja parliamentarian, Chodagam Ammanna Raja deputy speaker, Chodagam Ammanna Raja devadavi system, Chodagam Ammanna Raja varadakshina, Chodagam Ammanna Raja women employement registration, Feminist, women welfare, Freedom fighter, Eluru, Attili, social activist, politician, Andhra Pradesh

Chodagam Ammanna Raja was Indian freedom movement activist and Rajya Sabha member from Andhra Pradesh. She was a Renowned Politician, She was the member of Assembly and Deputy Speaker, also Member of Parliament Rajya Sabha from Congress party from 3 April 1962 to 2 April 1968. She resigned from the politics but sturggled hard for the wellbeing of women. She worked untiringly for the welfare of women.

మహిళా జనోద్దరణకే జీవితాన్ని అంకితం చేసిన చోగడం అమ్మనరాజా

Posted: 03/09/2022 07:32 PM IST
Chodagam ammanna raja freedom fighter who untirily sturggled for welfare of women

మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని పరిగణలోకి తీసుకుని వారి ఔనత్నాన్ని గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాది, వ్యాపార, వాణిజ్య, రాజకీయ, క్రీడా ఇత్యాది రంగాలలో ప్రోత్సహించి.. ప్రేరేపించడంతో పాటు వారికి ఆ దారిలో ఎదురయ్య సమస్యలను తొలగించి.. పూల బాట వేసిన తరుణంలోనే వారు సమాజానికి ఇతోధిక అభివృద్దికి దోహదపడతారు.

ఈ విషయాన్ని గంధం వీరయ్య నాయుడు శతాబ్దం క్రితమే గుర్తించారు. తన తనయను ఆ దిశగా వెన్నుతట్టి ప్రోత్సహించారు. కేవలం నెలసరి వేతనంపైనే ఆధారపడినా.. తన తనయ విషయంలో మాత్రం ఏ అడ్డు చెప్పలేదు. ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ.. దాని ప్రభావం మచ్చకు కనబడదు. ఇందుకోసం ఓ కొత్త చట్టాన్ని శాసనసభలో అమోదింపజేశారామె. అంతేకాదు అమ్మాయిలను కన్న తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన వరదక్షణ (వరకట్నం)ని కూడా వ్యతిరేకంగా ఉద్యమించిన ఆమె.. ఇందుకు గాను వరదక్షిణ నిరోధక చట్టాన్ని కూడా తీసుకువచ్చారు.

ఇక అమ్మాయిలు పూర్తిగా వంటింటికే పరిమితం అన్న రోజుల్లోనూ అమె అందుకుభిన్నంగా వ్యవహరించారు. అమ్మాయిులు కూడా ఉద్యోగాలు చేయవచ్చునని, ఉపాది అవకాశాలు అందుకోవాలని అమె నినదించారు. అంతటితో ఆగకుండా వారికి కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగూణంగా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజిలో మహిళలు కూడా తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించేందుకు కృషిచేశారు. మహిళామణుల కోసం ఇంతచేసిన ఆమె ఎవరో మీకు తెలుసా.? అమె మరోవరో కాదు.. స్వాతంత్ర సమరయోధురాలు చోడగం అమ్మన్నరాజా.

చోడగం అమ్మన్నరాజా 1909 జూన్‌ 6వ తేదీన బందరులో గంధం వీరయ్య నాయుడు, నాగరత్నమ్మకు ఏడవ సంతానంగా జన్మించారు. కృష్ణాజిల్లా బోర్డు స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న వీరయ్యగారికి సెలజీతం తప్ప ఏ ఇతర సంపాదనా లేదు. ఆయనకు మొత్తంగా 11 మంది సంతానం. అయినా ఆయన తన తన బిడ్డలను నిత్యం ప్రోత్సహించారు. వారు ఎంచుకున్న రంగాలలో వారిని పయనించేలా చేశారు. కైకలూరు వంటి మారుమూల ఉన్న ఊళ్లో ఉంటూ చదువుకోవటానికి చోడగం అమ్మన్నరాజా పడిన ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఇవే అమెను మహిళలకు అండగా నిలబడేలా చేయడంలోనూ దోహదపడ్డాయి.

తనకు చదువుకోవడం చాలా ఇష్టం. అయితే అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా ఆడపిల్లలకు అరకొర విద్యావసతులే ఉండేవి. కైకలూరులో ఆడ పిల్లలకు హైస్కూలు లేదు. దీంతో సమీపంలోని ఇతర పాఠశాలలో చేరి వాటిలో చదువుకొవాలంటే.. అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అయితే పాఠశాలలు ఉన్నా.. అక్కడి అమ్మాయిలకు హాస్టళ్లు లేవు. బందరులో అమ్మన రాజాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో నానా ఇబ్బందులుపడి, రాజమండ్రి హైస్కూలులో చేరి, ట్రెయినింగు స్కూలు హాస్టలులో ఉంటూ ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. అయితే కంచుమర్తి రామచంద్రారావు అనే సంపన్న గృహస్థు తమ కుమార్తె పేర ఇచ్చిన స్కాలర్‌షిప్ అందకపోతే తన చదువు సాగేదేకాదని, అందుకు కృతజ్ఞత కనపరుస్తారు ఆమె.

కళాశాల చదువులకు మద్రాసు వెళ్లారు. గవర్నమెంటువారి ఉపకారవేత నం లభించింది. మిస్‌డిలాహే అనే బ్రిటిష్‌ వనిత అపడు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆమె నిజంగా ఎంతగానో
కనిపెట్టి ఉండేవారు. సమయానికి ఇంటివద్ద నుండి డబ్బురాకపోతే బిల్లులు అన్నీ సకాలానికి స్వయంగా చెల్లించి ఆమెను ఎవరూ చిన్నబుచ్చ కుండా ఆదుకునేవారు. 1932లో పట్ట భద్రురాలయి ఆ ఊళ్లోనే లేడీ విల్లింగ్టన్‌ ట్రెయినింగు కాలేజీలో ఎల్‌.టి. అయినారు. సికింద్రాబాదు ఆడపిల్లల స్కూలులో కొంతకాలం ఉద్యోగం చేసి న మీదట బాపట్లలో వెలగపూడి సుబ్బారావుగారు నెలకొల్పిన ట్రెయినింగు స్కూలులో హెడ్డ మిస్ట్రెస్‌గా చేరారు. ఆ సమయంలో మాంట్‌ఫోర్లు సంస్కరణ (సవరణ) ఫలితంగా దేశంలో ఎన్నికలు జరుపవలసి వచ్చింది. అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఇమిడి ఉన్న ఆంధ్రప్రదేశం తరపున స్త్రీలకు రెండు స్థానాలు ప్రత్యేకించారు.

ఒకటి ఏలూరు, రెండవది బళ్లారి. మద్రాసు రాష్ట ప్రభుత్వం జస్లిస్‌ పార్టీ చేతులలో చిక్కుకున్సది. ఆ ప్రభావం ఏలూరుకీ వ్యాపించింది. అందువల్ల ఏలూరు నియోజకవర్గానికి పోటీ చేయడానికి పాత కాంగ్రెసు మహిళానేతలు ఎవరూ ముందుకురాలేదు. ఆ పరిసితులలో అమ్మన్నరాజాను కాంగ్రెసు అభ్యరినిగా నిలబెట్టారు. సరోజినీనాయుడు, భూలాభాయి దేశాయి వంటి నాయకులువచ్చి అమ్మన్నరాజాకు మద్దతుగా ప్రచారం చేయడంతో ఆమె గెలుపోందారు. లేజస్టేటివ్‌ అసెంబ్లీ మెంబరు అయినారు. నిజానికి అప్పటివరకు ఆమె ఖాదీ అమ్మకం, హార్హాల్‌ జరపటాలు, సైమన్‌ కమిషన్‌ నిరసన ప్రదర్శనలలో పాల్గొనటం వంటి చిన్నిచిన్న సంఘటనలలో పాల్గొనటం తప్ప ఏనాడు రాజకీయాలలో ముఖ్యభూమిక పోషించలేదు.

ఇంతలో రెండవ ప్రపంచ సంగ్రామం వచ్చింది. ఎటువంటి సంప్రదింపులు భారతదేశంతో జరపకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం మనదేశాన్ని యుద్దరంగంలోకి ఈడ్చింది. అది అవమానంగా భావించింది కాంగ్రెసు. అందువల్ల 1939లో కాంగ్రెసు అభ్యర్థులె2ైన అసెంబ్లీ మెంబర్లందరూ రాజీనామా యిచ్చి బయకు వచ్చారు. వారిని అమ్మన్న రాజా అనుసరించారు. 1940 ఆగస్టు 27 న పొల్లాచిలో మునిసిపల్‌ ఇంజనీరుగా ఉంటున) చోడగం జనార్ధనరావుతో ఆమె వివాహం జరిగింది. గృహిణిగా పొల్తాచి వెళ్లారు. రెండునెలలు అయింది. బ్రెటిష్‌ ప్రభుత్వ నిరంకుశ విధానం పట్ల అసమ్మతి సూచకంగా వ్యష్టి సత్యాగ్రహం జరపమంటూ కాంగెసు అధిష్టానం అదేశాలు జారీ చేసింది. దీంతో 1940 నవంబరులో స్వస్థలమైన కైకలూరులో సత్యాగ్రహం చేశారు. అనుకున్నంత అయింది. ఒక సంవ త్పరం కఠినశిక్ష, రూ.500 జరిమానాతో బ్రిటిష ప్రభుత్వం ఆమెను శిక్షించింది.

ఏ కట్నకానుకలు స్వీకరించకపోయినా ఆమె భర్త జనార్థన రావు రూ.500 జరిమానా కట్టక తపలేదని బంధుమిత్రులందరూ ఆమెను పరిహసించారు. రాయవేలూరు జెరైలుకు చేరుకున్నారు. అదే సమయంలో ఆ జెరైలులో రుక్కీణీ లక్ష్మీపతి, రాధాబాయి సుబ్బరాయన్‌, కృష్ణాబాయి నీంబ్‌కర్‌, ఉప్పల మెల్లీ షోలింగరు అనే స్విస్‌ యువతి, బెజవాడ లక్ష్మీ కాంతమ్మ గోపాలరెడ్డి, వల్లభనేని సీతామహలక్ష్మమ్మ, కుట్టి మాలు సహా ఏకంగా 80 మంది మహిళలు సత్యాగ్రహం చేశారు. ఒకసారి మద్రాసు నుండి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ జైళ్ల తనిఖీలు చేయటానికి వచ్చారు. అప్పుడు ఆమె “మేము సాధారణ నేరస్తులం కాదుకదా, కోరి మా దేశంకోసం శిక్షను ఆహ్వానించి వచ్చాము. మీరు పొమ్మన్నా మేమే పారిపోటోము. అనవసరంగా రాత్రంతా తాళాలువేసే గదులలో బంధించడం ఎందుకని” ప్రశ్నించారు.

ఆయనకది సబబని నమ్మకం కలిగింది. వెంటనే రాత్రంతా గదులకు తాళాలు వేసి బంధించనవసరం లేదని ఉత్తర్వులు జారీచేశారు. అంతటితో ఆ బాధ విరగడ అయిపోయింది. ఒక కొత్త సత్యాగ్రహి జైళ్లకువచ్చినా, ఒకరు గడువు తిరివెళ్లిపోయినా అదొక పెద్ద హడావిడి. దాదాపు అందరూ విడుదల అయినారు. కాని సంవత్సరం శిక్షపడిన కారణంగా రుక్కిణి లక్ష్మీపతి, కుట్టిమాలు అమ్మలతో ఈమె మిగిలిపోయినారు. అక్టోబరు 1941లో విడుదలయ్యారు. 1946లో ఎన్నికలు వచ్చినవి. కాంగ్రెసు అభ్యర్దినిగా ఆమె ఏలూరు నియోజకవర్గం నుంచి స్త్రీల ప్రత్యేక స్లానానికి డాక్ట రు కొమజ్దాజు అచ్చమాంబ గారి ప్రత్యర్థిగా పోటీచేశారు.

ఈ ఎన్నికలలో అమ్మన్నరాజా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవటమేకాక అసెంబ్లీ డిప్యూటీ స్సీకరుగా కూడ ఎన్నికయ్యారు. 1952 వరకు ఆ హోదాలో ఉండి ఆంధ్ర మహిళా సామర్థ్యాన్ని చాటారు. డాక్టరు ముత్తులక్ష్మీరెడ్డితో పాటుగా ఆమె దేవదాసీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలని కార్యోన్ముఖురాలైన అమె.. ఇందుకుగాను రాష్ట్రంలో ఓ ప్రత్యేక చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఎంతో సమర్దవంతంగా దానిని ఆమోదం పొందేలా చేసిన.. రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను నిర్మూలించారు. తద్వారా డాక్టరు ముత్తులక్ష్మీరెడ్డి గారి బహుకాలకృషిని సఫలం చేశారు. 1947 మద్రాసు దేవదాసీ విధానరద్దు బిల్లుగా అది చార్తిక ప్రఖ్యాతి పొందింది. మరి 11 సంవత్సరాలకు 1950లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వరదక్షణ నిరోధక చట్టం ప్రవేశపెట్టి సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles