Biography of Nirmala Deshpande was noted Indian social activist | Gandhian philosophy

Nirmala deshpande indian social activist biography gandhian philosophy

Nirmala Deshpande, Nirmala Deshpande history, Nirmala Deshpande wikipedia, Nirmala Deshpande life story, Nirmala Deshpande biography, indian social activists, tribal people, gandhian philosophy

Nirmala Deshpande Indian social activist Gandhian philosophy : The Biography of Nirmala Deshpande was a noted Indian social activist who had embraced Gandhian philosophy. She devoted her adult life to promotion of communal harmony and service to women, tribal people, and the dispossessed in India.

వేల ఎకరాల భూములను పేదలకు పంచిన గాంధేయవాది

Posted: 05/06/2015 08:24 PM IST
Nirmala deshpande indian social activist biography gandhian philosophy

బ్రిటీష్ పరిపాలన నుంచి భారత్ ను విముక్తి కలిగించిన మహాత్మాగాంధీజీ సూత్రాలను ఎంతోమంది ఆచరిస్తుంటారు. ఆయన నడిచిన దారిలోనే అహింసకు వ్యతిరేకంగా అడుగులు వేస్తూ.. పేదప్రజలకు సేవ చేస్తుంటారు. ఏమాత్రం జీతభత్యం ఆర్జించకుండా గాంధీ దారిలోనే నడుస్తూ మానవత్వాన్ని కనబరుస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నిర్మలా దేశ్ పాండే ఒకరు! ప్రముఖ గాంధేయవాది అయిన ఈమె.. శాంతి యాత్రలు నిర్వహించి సమస్యలను పరిష్కరించిన ప్రముఖ సామాజిక కార్యకర్త! జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది.

జీవిత చరిత్ర :

1929 అక్టోబర్ 29వ తేదీన మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో విమల, పి.వై.దేశ్‌పాండే దంపతులకు నిర్మలా దేశ్‌పాండే జన్మించింది. ఈమె విద్యాభ్యాసం స్థానికంగా నాగపూర్‌లోనే కొనసాగింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచే ఎం.ఏ. పట్టా పొందింది. అన్ని వ్యవహారాల్లో చురుకుగా వుండే ఈమె.. గాంధీ సూత్రాలకు ఆకర్షించబడి, ఆయన మార్గంలోనే జీవితాంతం నడించింది. దేశంలో నెలకొన్న సమస్యలను, జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో తనవంతు కృషి చేసింది. అలాగే.. రాజకీయరంగంలోనూ ఈమె తన సత్తా చాటింది. 1997 ఆగష్టులో తొలిసారిగా రాజ్యసభకు నియమితులైన ఈమె.. మళ్ళీ 2004 జూన్ లో రెండవ సారి రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడింది.

నిర్మలా చేసిన సేవలు :

1. 1952లో వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా నిర్మలా దేశ్‌పాండే సామాజిక ఉద్యమంలో అడుగుపెట్టింది. వినోభాతో కలిసి 40,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ యాత్ర సమయంలో దాతలనుంచి అనేక వేల ఎకరాల భూములను సేకరించి.. వాటిని పేద ప్రజలకు పంచిపెట్టింది.

2. కాశ్మీర్‌, పంజాబ్ లో మతకలహాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు.. నిర్మలా ఆ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు శాంతి సందేశాలు అందించింది. 1996లో భారత్-పాకిస్తాన్ శాంతి సదస్సులో పాల్గొంది. అంతేకాదు.. టిబెట్టు సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషిచేసిన మహనీయురాలు నిర్మలా దేశ్‌పాండే.

మరికొన్ని విశేషాలు :

1. నిర్మలా హిందీలో అనేక నవలలు రచించింది. అందులో ఒకదానికి జాతీయ అవార్డు కూడా లభించింది. వినోబా భావే జీవిత చరిత్ర కూడా లిఖించింది.
2. 2006లో నిర్మలా దేశ్‌పాండేకు భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ బిరుదుతో సత్కరించింది. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు కూడా లభించింది.
3. జీవితమంతా గాంధేయవాదిగా ఉంటూ, సామాజికవాదిగా సేవలని అందించిన నిర్మలా 79వ యేట 2008, మే 1న ఢిల్లీలో తుదిశ్వాస వదిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirmala Deshpande  Indian Social Activists  Gandhian Philosophy  

Other Articles