Tanguturi Suryakumari biography who is Indian film famous singer and actress | Telugu Film Industry

Tanguturi suryakumari biography indian film singer actress dancer telugu cinema

Tanguturi Suryakumari, Tanguturi Suryakumari biography, Indian Film Actresses, indian actresses, telugu actresses, Tanguturi Suryakumari life story, Tanguturi Suryakumari story, Tanguturi Suryakumari history, Tanguturi Suryakumari news, telugu actress, telugu industry, tollywood

Tanguturi Suryakumari biography Indian film singer actress dancer Telugu cinema : Tanguturi Suryakumari was an Indian film singer, actress and dancer in Telugu cinema. She was the niece of Tanguturi Prakasam Pantulu. She has sung Maa Telugu Thalliki, the official song of the state Andhra Pradesh, India.

అలనాటి తెలుగు సినిమా నటి సూర్యకుమారి విశేషాలు

Posted: 04/27/2015 07:10 PM IST
Tanguturi suryakumari biography indian film singer actress dancer telugu cinema

తెలుగు చిత్రపరిశ్రమ తొలినాళ్లలో తళుక్కుమన్న ఎందరో నటీమణుల్లో కొందరు మాత్రమే చిరకాలంగా తమ పేరును ముద్రించుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఆ అలనాటి సుందరీమణుల్లో టంగుటూరి సూర్యకుమారి ఒకరు! తొలుత గాయకురాలిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత చిత్రపరిశ్రమలో ప్రవేశించి.. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇతర భాషాచిత్రాల్లో తన గాత్రంతో, నటనతో తన ప్రతిభను చాటి చెప్పింది.

జీవిత విశేషాలు :

1925 నవంబర్ 13వ తేదీన రాజమండ్రిలో టంగుటూరి సూర్యకుమారి జన్మించింది. ఈమె ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడైన టంగుటూరి శ్రీరాములు కూతురు. ఇతరులతో పోల్చుకుంటే ఈమె ఎంతో ప్రతిభావంతురాలని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. ఈమె తన మూడో ఏటలోనే పాటలు పాడేది. తన అద్భుతమైన గాత్రంతో బాల్యంలోనే ఎందరినో ఆశ్చర్యచికితుల్ని చేసింది. ఇక అందంలోనూ ఏమాత్రం తీసిపోని ఈమె.. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే సినీరంగ ప్రవేశం చేసింది.

సూర్యకుమారికి మంచి రూపం, మధురమైన కంఠస్వరం రెండూ బాగా ఉండడంతోపాటు ప్రార్థన గీతాలు పాడుతూండడంతో ఈమెకి సినిమాల నుంచి పిలుపు వచ్చింది. అయితే.. ఈమెది సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబం కావడం వల్ల వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ ఈమెకు సినిమాలమీద ఎక్కువ మక్కువ వున్న నేపథ్యంలో.. ఆ వ్యతిరేకతలను ఎదుర్కొని ఎలాగోలా సినిమాల్లో ప్రవేశించింది. ఇక అప్పటినుంచి ఏమాత్రం వెనక్కి తిరగకుండా తన సినీ ప్రస్థానాన్ని ముందకు కొనసాగించింది.

ఈమె 1937లో మద్రాసు చేరుకుని.. ‘రైతుబిడ్డ’ సినిమాతో సినీరంగ ప్రవేశము చేసినది. అనతికాలంలోనే నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందంతోపాటు నటనతో గొప్ప పేరు సాధించడంతో ఇతర భాషా పరిశ్రమల నుంచి అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంటూ ఈమె తెలుగు,తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది. అలాగే.. 1952లో నిర్వహించిన అందం పోటీల్లో ఆమె తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) ఎంపికైంది.

ఈమెకి నటనారంగంలో కంటే పాటలరంగంలోనే ఎక్కువ ఆదరణ లభించింది. ఎందుకంటే ఈమె పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటి వాటికి ఎక్కువ ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ సమయములో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’, ‘దేశమును ప్రేమించుమన్నా’ మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. లలితా, దేశభక్తిగీతాలు మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి.

విదేశాలో వ్యాపించిన ఖ్యాతి :

1960 దశకంలో ఈమె లండను వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' సంస్థను స్థాపించింది. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. అలాగే.. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, అమెరికామొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారుచేసింది.

అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని ‘కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’ నాటకంలో రాణి పాత్ర ధరించింది. ఆ పాత్రకుగాను ఈమె బ్రాడ్వే అవార్డు పొందింది. ఆ అవార్డు పొదిన మొదటి భారతీయ వ్యక్తిగా ఈమె తన పేరు లిఖించుకున్నారు. ఈ నాటకాన్ని న్యూయార్క్ లో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించింది. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించింది. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె!

1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో ‘రాజ్యలక్ష్మి అవార్డు’తో ఈమెను గౌరవించింది. లండనులోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్ తో వివాహమైంది. 1973లో అక్కడే స్థిరపడింది. అనారోగ్య కారణాల రీత్యా ఈమె 2005 ఏప్రిల్ 25న లండనులో మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanguturi Suryakumari  Telugu Actresses  Indian Film Industry  

Other Articles