Telugu great actress savitri biography tollywood news

telugu actress savitri, savitri great actress, savitri actress news, savitri biography, savitri life history, savitri life story, actress savitri wikipedia, actress savitri wiki telugu, savitri telugu history, savitri photos, telugu actress savitri photos, savitri updates, savitri great actress, savitri story

telugu great actress savitri biography tollywood news : actress savitri biography who is named as great heroine in film industry. she also done some projects as director and producer. read about her more...

తెలుగు సినీ ప్రపంచంలో మహానటిగా పేరుగాంచిన ‘సావిత్రి’

Posted: 12/06/2014 03:09 PM IST
Telugu great actress savitri biography tollywood news

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా.. తొలితరం సినీప్రముఖులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అటువంటివారిలో ముందుగా వుండేది ‘మహానటి సావిత్రి’! తెలుగు, తమిళ భాషాచిత్రాల్లో నటించిన ఈమె.. తరాల తరబడి ఇప్పటికీ ఆదరించబడుతోంది. ఈమె కేవలం నటిగానే కాదు.. నేపథ్య గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా.. ఇలా అన్నిరంగాల్లో ప్రతిభ కనబరిచారు.

జీవిత విశేషాలు :

1936 జనవరి 4న గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు సావిత్రి జన్మించింది. ఈ దంపతులకు మారుతి, సావిత్రి అని ఇద్దరు సంతానం. సావిత్రికి ఆరునెలలు వుండగానే ఆమె తండ్రి గురవయ్య టైఫాయిడ్ జ్వరంతో మరణించారు. దాంతో తల్లి సుభద్రమ్మ తన కుమార్తెలతో విజయవాడలోని అక్క దుర్గాంబ ఇంటికి మకాం మార్చారు. అక్కడే వున్న కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో మారుతి, సావిత్రి చెరారు.

పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. ప్రతిరోజూ ఇతరులు నాట్యం చేయడం చూసిన ఆమెకు కూడా ఆసక్తి పెరిగింది. దాంతో ఆమె  ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకొంది. అలా నేర్చిన ఆమె చిన్నతనంలోనే ఎన్నో నాటకాల్లో ప్రదర్శించింది. ఆనాడు  ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో.. అనంతరం పెదనాన్న నడిపిన నాట్యమండలిలో నటించింది.

13 ఏళ్ల వయస్సులో సావిత్రి కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఎంతో అద్భుతంగా ప్రదర్శించింది. అందుకుగాను ఆమె ఆనాటి రముఖ హిందీ నటుడు - దర్శకుడు - హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు పృధ్వీరాజకపూర్ చేతులమీదుగా బహుమతి అందుకుంది. అదే ఆమెకు చిత్రపరిశ్రమలో ఎంట్రీ అవడానికి కారణమైంది. ఆ బహుమతితో చిత్రపరిశ్రమలో రాణించగలననే నమ్మకం పెరిగింది. దాంతో 1949లో చిత్రాల్లో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది.

సినీ జీవితం :

ఎన్నో నాటకాల్లో ప్రదర్శించి తన ప్రతిభను నిరూపించుకున్న సావిత్రి.. చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడానికి ముందు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మొదట్లో ఎల్వీప్రసాద్ దర్శకత్వం వహించిన ‘సంసారం’ చిత్రంలో ఒక చిన్న పాత్రను పొందిందికానీ.. తక్కువ వయస్సు వున్న కారణంగా అందులోంచి తొలగించబడింది. తర్వాత కొన్నాళ్లపాటు అవకాశం కోసం ఎదురుచూడగా.. ఆనాడు దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘పాతాళభైరవి’లో ఆమెను ఒక చిన్నపాత్ర పోషించే ఆఫర్ ఇచ్చారు. అనంతరం ‘పెళ్లిచేసిచూడు’ అనే చిత్రం రెండో కథానాయికగా చేసింది.

అంతవరకు ఓ మోస్తరు పాత్రలు రావడంతో కాస్త నిరాశకు గురైన ఆమె.. కథానాయికగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు చాలాకాలం ఆగాల్సి వచ్చింది. అప్పుడు ఆమెకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ చిత్రంలో హీరోయిన్ పాత్ర లభించింది. ఇక ఎల్వీప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రం ద్వారానే ఆమెకు నటిగా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడేలా చేసింది ఆ సినిమా!

ఆ తర్వాత ఎన్నో వైవిధ్యభరమైన పాత్రల్లో నటించి, ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనావైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించి మహానటిగా బిరుదు పొందింది. నటిగా ప్రత్యేక గుర్తింపు సాధించిన అనంతరం ఆమె నిర్మాణ, దర్శకత్వం రంగాల్లోనూ ప్రవేశించారు. ‘‘ఏక్ చిట్టీ ప్యార్ భరీ’’(1985) (హిందీ సినిమా) చిత్రానికి నిర్మాతగానూ, దర్శకురాలిగా 6 తెలుగు, తమిళ చిత్రాలకు పనిచేశారు.

వ్యక్తిగత విషయాలు :

చిత్రపరిశ్రమలో ఏవిధంగా మహానటిగా ఎదిగిందో.. వ్యక్తిగత జీవితంలో అన్నే పరాభావాలను చవిచూడాల్సి వచ్చింది. 1956లో అప్పటికె రెండు పెళ్లిళ్లయిన జెమినీ గణేశన్’ను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే తెలుగులో ఘన విజయం సాధించిన మూగనసులు చిత్రాన్ని తమిళంలో తన భర్తతో నటించి, నిర్మించింది సావిత్రి! ఆ చిత్రం ఘోరంగా పరాజయం కావడంతో ఆమె ఆర్ధికపతనానికి దారితీసింది. ఆస్తిపాస్తులు మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.

దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. చివరికి ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ బాధలో కూరుకుపోయిన సావిత్రి.. తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసైంది. చివరకు ఆమె 1981 డిసెంబర్ 26వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles