Actress jamuna biography telugu film industry

jamuna, actress jamuna, jamuna biography, jamuna photos, jamuna news, jamuna press meet, jamuna life story, jamuna life history, jamuna

actress jamuna biography telugu film industry

చిత్రపరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపుపొందిన జమున

Posted: 12/04/2014 04:20 PM IST
Actress jamuna biography telugu film industry

తెలుగుచలన చిత్రపరిశ్రమలో ఇంటవరకు హీరోయిన్లుగా కొనసాగినవాళ్లు చాలామందే వున్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటనాప్రతిభతో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ప్రత్యేకముద్రను వేసుకన్నారు. అటువంటి తారల్లో జమున ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా.. తెలుగునేలలో పెరిగి, చిత్రపరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరుగాంచింది.

జీవిత విశేషాలు :

1937లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున పుట్టింది. అయితే కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్’కి తరలిరావడంతో ఆమె బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మనక్షత్రం రీత్యా ఏదైనా నదిపేరు వుండాలని జ్యోతిష్కులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.

సినీ ప్రస్థానం :

జమున స్కూలులో చదివేకాలం నుంచే నాటకాలవైపు ఆకర్షితురాలయ్యింది. దాంతో ఆమెకు నాటకాల్లో పాల్గొనాలనే కోరిక పుట్టింది. అప్పుడు తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలోఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు. ఆ నాటికలో మరో ప్రముఖనటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకంతోబాటు ఇతర చాలా నాటకాల్లో కూడా ఆమె నటించింది. ఆ నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్లే సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

ఆమె మొదటిచిత్రం ‘పుట్టినిల్లు’. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి నాయికగా చాలా సినిమాల్లో నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెను మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. ఇప్పటికీ చాలావరకు ఆ పాత్ర గురించి చర్చించుకుంటూనే వుంటారు. అనంతరం ‘శ్రీకృష్ణ తులాభారం’లో కూడా ఆమె అదే పాత్ర పోషించి, మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్రే ఆమెను ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఈమె కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘనవిజయాలనే అందుకున్నాయి. చాలాకాలంవరకు సినీతారగా ప్రస్థానాన్ని కొనసాగించిన ఆమె.. రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆ రంగంలో రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. దివంగత ఇందిరాగాంధీ మీదున్న అభిమానం, గౌరవంతోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress jamuna  telugu actresses  telugu film industry  tollywood  telugu news  

Other Articles