Barma leader aaung saan suki special story

barma leaders, barma politics, aaung saan suki, aung san suki, suki, barma women, women of the year, nobel peace awadee, nobel award, barma women leader

aaung saan suki special story baout her life history, and political career in barma

శాంతికి మారు పేరు ఆంగ్ సాన్ సూకీ

Posted: 12/10/2014 07:35 PM IST
Barma leader aaung saan suki special story

ఆంగ్ సాన్ సూకీ బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. శాంతి నిర్వచనంగా ఎందఱో మహానుభావుల పేర్లు చెప్పుకుంటాము మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఇలా ఎందఱో వాళ్ళలో ఈమె ఒకరు ఆంగ్ సాన్ సూకీ కొన్ని దేశాలు ఆమె ని చూసి గర్వ పడతాయి. అలుపెరుగని వీరనారిగా ప్రసిద్ది గాంచిన ఈ బర్మా పోరాట యోధురాలు దేశ సంరక్షణ కోసం ఎన్నో త్యాగాలను చేసి ప్రపంచ దేశాలో ద్రుష్టిలో చిరస్థాయిగా నిలిచి అందరికి ఆదర్శ ప్రాయురాలైంది. ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.

సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో మరియు షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో నోబుల్ shanti బహుమతి అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది.వెనుజులా ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో కెనడా ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.

2012 ఏప్రెల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికం గా ఎన్నికల కమీషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మా గా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక.

ఆంగ్ సాన్ సూకీ అనే పేరు మూడు బాంధవ్యాల నుండి తీసుకో బడింది. ఆంగ్ సాన్ అనేది తండ్రి నుండి, సూ అనేది తాత నుండి, కీ అనేది తల్లి ఖిన్ కీ నుండి గ్రహించబడింది. డా అనేది ఆమె పేరులో భాగం కాదు. డా అనేది అమ్మగారు (మేడం) లా గౌరవ పదం. ఇది పెద్ద వారిని పేరున్న స్త్రీలను సూచించే పదం. బర్మీయులు ఆమెను తరచుగా " డా సూ "(లేక ఆమయ్ సూ, అనుయాయులు మదర్ సూ ) అని సంబోధిస్తుంటారు. ఇంకా సూ ఆంటీ మరియు దాక్టర్ సూ ఆని కూడా పిలుస్తుంటారు. మిస్ సూకీ అని విదేశీయ మాధ్యమం అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర బర్మీయులకు ఉన్నట్లు ఆమెకు మారు పేరు ఏమీ లేదు.

వ్యక్తిగత జీవితం

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్రం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్ మరియు ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ కాలిఫోర్నియా లోని శాన్ డియోగో కు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిద్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపధ్యం మరియు మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు హైస్కూల్" లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత బౌద్ధ మతానికి చెందినది.

గృహనిర్బంధం

ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధం లో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, రాజకీయాలు మరియు జీవితకథలను చదవడంతో గడిపానని వివరించింది. ఆమె కొన్నిమార్లు పియానోవాయించడం, అనుమతించిన అతిధులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది. మాధ్యమం కూడా సూకీని చూడడానికి వీలుపడకుండా కట్టడి చేయబడింది. 1994 సెప్టెంబర్ 20 తేదీన పత్రికా సంపాదకుడైన మౌరిజియో జియూలినో ఆమె చాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫొటో ఫిలిం, టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకొనబడ్డాయి. బదులుగా ఆమె గృహనిర్బంధ కాలంలొ 1994 లో బర్మా నాయకుడైన జనరల్ ఖిన్ న్యుయంట్ తో మొదటిసారిగా సమావేశం జరిగింది. సూకీ ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాలలో ఆసుపత్రిలో చేర్చబడింది.

బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధం లో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను మరియు దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది. 1975లో అమలు చేయబడిన "స్టేట్ ప్రొటెక్షన్ ఏక్ట్" (ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలం నిర్బంధం లో ఉంచడానికి అనుమతిస్తుంది) మరియు సెక్షన్ 22 చట్టం " తిరుగుబాటు దార్ల ప్రమాదం నుండి దేశాన్నిరక్షించాలి " అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది. ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీలు చేస్తూనే వచ్చింది. 2010 నవంబర్ 12 న నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన " యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యు.ఎస్.డి.పి)ఎన్నికలలో గెలిచిన తరువాత దాదాపు 20 సంవత్సరాల తరువాత నిరంకుశ ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ విడుదల పత్రాలమీద సంతకం చేసింది. సూకీ గృహనిర్బంధం 2010 నవంబర్ 13 తేదీన ముగింపుకు వచ్చింది.

ప్రపంచ దేశాలా జోఖ్యంతో ఆంగ్ సాన్ సూకీ ప్రజల మధ్యకు రావాలన్న నీరిక్షణ ఫలించింది. గృహ నిర్భంధం నుండి విడులయిన మరుక్షణం ప్రజల్లోనే గడిపింది. ఇప్పటికి ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్న ఈ పోరాట యోదురాలికి తెలుగు విశేష్ సవినయంగా నమస్సూమాంజలులు తెలియజేస్తుంది.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aung san suki  barma  politics  life history  

Other Articles