Director nandini reddy interview

Ala Modalaindi Movie Director Nandini Reddy Exclusive Interview, Nandini Reddy Interview, Director Nandini Reddy Interview, Ala Modalaindi Movie Director Nandini Reddy Interview

Ala Modalaindi Movie Director Nandini Reddy Exclusive Interview, Nandini Reddy Interview, Director Nandini Reddy Interview, Ala Modalaindi Movie Director Nandini Reddy Interview

Director Nandini Reddy Interview.png

Posted: 08/06/2012 04:56 PM IST
Director nandini reddy interview

 Director_Nandini_Reddy_Interview

director-nandini-reddyమహిళలు రాజ్యాలను ఏలుతున్నారు. విమానాలు నడుపుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. సినిమా తీయలేరా ? ఇదే ప్రశ్న చాలామందిని అడిగి చూశారామె.  దానికి సమాధానం దొరకడానికి చాలా యేళ్లు పట్టింది.. దొరికిన తర్వాత ఒక్కక్షణం ఆగలేదామె. అద్భుతమైన సినిమాను తీశారు. సినీ ఫీల్డ్‌లో ఓ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. పెద్ద సినిమాలన్నీ ఫెయిల్యూర్ బాట పట్టిన సమయంలో ‘అలా మొదలైంది’ లాంటి చిన్న సినిమాతో సెన్సేషన్ సృష్టించి, తన రెండో సినిమాతో మళ్లీ మనముందుకు రాబోతున్న దర్శకురాలు నందినీరెడ్డి.

నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాన్న భరత్‌రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్. నా చిన్నతనంలోనే అమ్మానాన్నా విడిపోయారు. నాన్న బెంగళూరులో స్థిరపడిపోయారు. నేను, అమ్మ, తమ్ముడు వెస్ట్ మారేడ్‌పల్లిలో అమ్మమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం.ఇప్పటికీ నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. మా వీధిలో చాలామంది పిల్లలుండేవారు. అందరం కలసి అలుపన్నదే లేకుండా ఆటలాడేవాళ్లం. మాకు రెండిళ్లవతల మా ఫ్రెండ్ యుగంధర్ (ఇప్పుడు ముంబైలో ఫిల్మ్ మేకర్) ఇల్లుండేది. వాడు, నేను వీధిలోని పిల్లలందరినీ ఒకచోటికి చేర్చి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లం.మా తమ్ముడు అందరి కంటే చిన్నవాడు కావడంతో వాడితో ఆడపిల్లల వేషాలు వేయించేవాళ్లం. సీత, ద్రౌపది, సత్యభామ... అన్నీ వాడే. టీవీలో స్టార్‌ట్రెక్ చూసి కార్డ్‌బోర్డుతో గన్స్ చేసు కునేవాళ్లం. అగ్గిపెట్టెలతో వాకీటాకీలు, చీపురు పుల్లలతో బాణాలు చేసేవాళ్లం. ల్యాప్‌టాపుల్లో, సెల్‌ఫోనుల్లో గేమ్స్ ఆడుకునే దౌర్భాగ్యం అప్పటి పిల్లలకు ఉండేది కాదు కదా! అందుకే మా బాల్యం ఓ మధురానుభూతిగా మిగిలిపోయిందని అనుకుంటూ ఉంటాను.

ఎటు గాలి వీస్తే అటు!

నేనెప్పుడూ మంచి స్టూడెంట్‌నే. కనీసం సెకెండ్ వచ్చినా అమ్మ ఊరుకునేది కాదు. దాంతో ఫస్టు రాక తప్పేది కాదు. సెయింట్ ఆన్స్ స్కూల్, కోఠీ ఉమెన్స్ కాలేజీల్లో నా చదువు సాగింది. అయితే ఎప్పుడూ ఇది అవ్వాలి అని స్థిరంగా నిర్ణయించుకున్నది లేదు. ఆ సమయానికి ఏది తోస్తే అది చేయాలనుకునేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పుడు మెడిసిన్ అనుకున్నాను.కానీ ఐదేళ్లు ఎవరు చదువుతార్రా బాబూ అని ఎంట్రన్స్ రాయడం మానేశా. క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెటర్‌ని అవ్వాలనుకున్నాను. కానీ డిగ్రీ అయ్యాక మా ఫ్రెండ్సంతా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి అప్లై చేద్దామంటే సరే అన్నాను.సీటొస్తే వెళ్లి చేరిపోయాను. అక్కడ ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో పీజీ చేస్తున్నప్పుడే సివిల్స్ రాద్దామనుకున్నాను. కానీ ఏ విషయానికీ రాజీపడలేని నా తత్వానికి ప్రభుత్వోద్యోగం సరిపడదనిపించింది. అందుకే అదీ వదిలేశాను.ఇలా.. ఏం చేద్దామా అని ఆలోచిస్తూనే ఆరు నెలలు గడిపేశాను. ఓరోజు మా అమ్మ బాగా తిట్టేసింది. ‘పీజీ అయ్యి ఆర్నెల్లయ్యింది. తినడం, పడు కోవడం తప్ప చేసేదేమైనా ఉందా’ అని అరిచేసరికి నాకు కోపమొచ్చేసింది. సాయంత్రానికల్లా ఉద్యోగం సంపా దిస్తానని చాలెంజ్ చేసి, మారుతి ఎస్టీమ్‌కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరిపోయా. పదిరోజులు చేశాక ఇంప్రెస్ అయ్యి మంచి పోస్ట్ ఇచ్చారు. కానీ ఒకచోట కుదురుగా కూర్చుని పనిచేయడం మనకు సరిపడదు కదా! నావల్ల కాదని వదిలేశా. ఇలా ఎటు గాలివీస్తే అటు సాగిపోతూనే ఉన్నా. కొన్నాళ్లు ఎఫ్.ఎం.లో కూడా చేశా.

చివరికి ఓ రోజునా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ ఓ ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఇక ఏదీ కుదరడం లేదని యాడ్ ఫీల్డ్‌లో సెటిలైపోవాలని స్ట్రాంగ్‌గా డిసైడై, యాడ్ ఏజెన్సీలకు తిరుగుతున్నప్పుడు... గుణ్ణం గంగరాజుగారు ఏదో చిన్న పిల్లల సినిమా తీస్తున్నారని, దానికి టెక్నీషియన్స్‌ని తీసుకుంటున్నారు ట్రై చేయమని నా ఫ్రెండ్ చెబితే అదీ ట్రై చేసి చూద్దాంలే అని వెళ్లాను. వచ్చిన వాళ్లందరితో గంగరాజుగారు ఓ రెండు గంటలపాటు డిస్కషన్ పెట్టారు. నేనేం మాట్లాడానో నాకైతే తెలీదు కానీ,ఇంప్రెస్సై అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమిచ్చారు. ఆ సినిమా ‘లిటిల్ సోల్జర్స్’.

ఆడాళ్ల సినిమా తీస్తావా అన్నారు!

nandini-reddy1మొన్నామధ్య జేఎన్‌యూలో నాతో చదువుకున్న ఓ ఫ్రెండ్ ఫోన్ చేసింది. తను చెబుతోంది. నేను హాస్టల్లో పొద్దున్నే నాలుగింటికి చదువుకోడానికి లేచి ‘లైట్స్ కెమెరా యాక్షన్’ అనేదాన్నట. అప్పుడలా ఎందుకనేదాన్నో నాకైతే తెలీదు కానీ ఇప్పుడు రోజూ అదే మాట అంటున్నాను. అయితే ఇక్కడివరకూ తేలికగా వచ్చేయ లేదు నేను. ఎన్నో యేళ్ల సుదీర్ఘ ప్రయాణ మిది. కొత్తలో నన్ను కొందరు కాస్ట్యూమ్ డిజైనర్‌నని, మరికొందరు కొరియో గ్రాఫర్‌కి అసిస్టెంటయి వుంటానను కున్నారు. అలా ఎందుకనుకుంటున్నారో మొదట్లో అర్థమయ్యేది కాదు కానీ, తర్వాత తెలిసింది డెరైక్షన్ విభాగంలో ఆడవాళ్లు ఉండటం చాలా అరుదని!ఈ ‘ఆడ’ అన్నమాట మొన్నటి వరకూ నన్ను వెంటాడుతూనే ఉంది. ఎవరికైనా కథ చెప్పడానికి వెళ్తే- ‘ఏం కథ చెప్తారు, లేడీస్ సబ్జెక్టా’ అనేవారు. లేడీస్ సబ్జెక్ట్ అంటే... వంటల మీద తీయాలా? ఆడపిల్లల కష్టాలు చూపించాలా? అత్తా కోడళ్లు, భార్యాభర్తలు, వరకట్న చావులు... వీటిమీద తీయాలా? నేను ఆడపిల్లనైనంత మాత్రాన ఇవి తప్ప వేరేవి చూపించలేనా? చెప్పాలంటే ప్రతి స్త్రీలోనూ కాస్త పురుష స్వభావం ఉంటుంది.

మామూలు టెన్షన్ కాదది !

మొదటి సినిమా, ఎన్నో ప్రయత్నాల తర్వాత దొరికిన అవకాశం... చేస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్. రిలీజ్‌కి ముందు కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఇద్దరు ముగ్గురు పెద్ద దర్శకులు వచ్చి సినిమా చూసి, ఆడటం కష్టమని చెప్పి వెళ్లిపోయారు. దాంతో నాకింకా టెన్షన్ పెరిగిపోయింది. కొన్ని సీన్లేమైనా మారుద్దామా అనుకుంటూనే ఫ్రెండ్స్ కొందరికి చూపించాను. వాళ్లు చూసి, ‘సినిమా చూసినట్టు లేదు, మూడు గంటలసేపు నీతో గడిపినట్టుంది ’ అన్నారు. అంతలా ఎంజాయ్ చేశారు వాళ్లు. నాకప్పుడే అర్థమైపోయింది, నా సినిమా హిట్టని, ఇక ఒక్క సీన్ కూడా మార్చాల్సిన అవసరం లేదని !

నా ఫ్రెండ్స్ జడ్జిమెంట్ కరెక్టయ్యింది.నిర్మాత దాము నామీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఒక్కటే అన్నారు- డబ్బు సంగతి ఫర్వాలేదు కానీ, ఉన్న పేరు మాత్రం పోకూడదమ్మా అని. మీరు పది రూపాయలు పెడితే పదకొండో రూపాయి వస్తుందో లేదో తెలీదు కానీ, పెట్టిన పది రూపాయలూ ఏమాత్రం వేస్ట్ కావు అని చెప్పాను నేను. అదృష్టంకొద్దీ ఆ మాటను నిలబెట్టుకోగలిగాను. నా సినిమా హిట్టయ్యిందన్న దాని కంటే నన్ను నమ్మిన నిర్మాత నష్టపోలేదు అన్న భావనే ఎక్కువ సంతోషాన్నిచ్చింది నాకు.

వద్దంటే వదల్లేదు !

అంతఃపురం సినిమాలో సౌందర్య ప్రెగ్నెంట్ అని తెలిసే సీన్ ఒకటుంది. సౌందర్య కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి ఆమె నెల తప్పిందని కన్‌ఫార్మ్ చేయాలి. ఆ డాక్టర్ పాత్ర నేనే చేయాలని పట్టుబట్టారు కృష్ణవంశీ. నేను మీ అసిస్టెంట్‌ని, నేను నటించడమేంటంటే వింటేనా! ఇక తప్పక సరే అన్నాను. తీరా చేయాల్సి వచ్చినప్పుడు ఎంత టెన్షన్ పడ్డానంటే, ఆమె గర్భవతి అని తెలియగానే కంగ్రాట్స్ చెబుతూ హీరో సాయికుమార్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా పక్కనే ఉన్న బాబూమోహన్‌కి ఇచ్చేశాను. అందరూ పడీ పడీ నవ్వారు. చాలాకాలం నన్ను ఏడిపించారు.

Nandini-reddyఇలా ఉండటమే ఇష్టం !

చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడూ ప్యాంటుషర్టుల్లో ఉంటారేంటి అని. నాకు అందంకంటే సౌకర్యం ముఖ్యం. అందుకే ఇలా ఉంటాను. చీరలవీ కట్టుకుని తిరగడం నావల్ల కాదు. హెయిర్ స్టయిల్ కూడా ఇదే నచ్చుతుంది నాకు. పెళ్లి గురించి కూడా కొందరు అడుగుతూ ఉంటారు. పెళ్లి ముఖ్యమే కాని పెళ్లే ముఖ్యం కాదన్నది నా అభిప్రాయం. మగాళ్లే కాదు, ఆడపిల్లలు కూడా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. నా వరకూ నేను నాకు నచ్చినవాడు దొరికితే చేసుకుంటాను. దొరక్కపోతే ఇలా ఉండిపోవడానిక్కూడా సిద్ధమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biography of jayaprada
Festival raksha bandhan special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles