అందానికి అభినయానికి నిలువెత్తు ప్రతిరూపం... వెండి తెర పై వేలాది ప్రేక్షకుల మనసు తెర పై వెలుగొందిన వెన్నెల దీపం జయప్రద. సహజమైన సౌందర్యానికి సరిహద్దులా అనిపించే జయప్రద అసలు పేరు లలితారాణి. 1959 ఏప్రిల్ 3న ఆమె రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనం నుంచే జయప్రద నాట్యంలో శిక్షణ పొందారు. ఆ నాట్యమే ఆమెని భూమి కోసం అనే చిత్రంలో మూడు నిమిషాల సేపు కనిపించేలా చేసింది. ఆ మూడు నిమిషాలే ఆమె సినీ జీవితాన్ని మూడు దశాబ్దాలకి పైగా నడిపించింది. తొలి చూపులోనే ఎవరీ సౌందర్యం అనిపించేలా ఆమె ముగ్దమనోహర రూపం అందర్నీ కట్టి పడేసింది.బాలచందర్ దర్శకత్వంలో చేసిన అంతులేని కథ, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన సిరిసిరి మువ్వ వంటి చిత్రాలు ఆమె సినీ జీవితానికి రెడ్ కార్పెట్ పరచి, స్వాగతం పలికాయి.
అనంతరం ఆమె తెలుగు కమర్షియల్ సినిమాకు చిరునామా అయిపోయింది. యన్టీఆర్ తో అడవి రాముడు సినిమాలో వచ్చిన అవకాశం ఆమె జీవితాన్ని పెద్ద మలపు తిప్పింది. యమగోల చిత్రం జయప్రద ఇమేజ్ ని అందనంత ఎత్తుకి తీసుకుపోయింది. యన్టీఆర్, అక్కినేని, క్రిష్ణ, మెహన్ బాబు, క్రిష్ణంరాజు, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన ఆమె తిరుగులేని కథానాయికగా రాణించింది. ‘శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, సీతాకల్యాణం, బావమరదళ్ళు , వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అగ్ర కథానాయకుల జోడిగా ఆమె నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలు దక్కించుకున్నాయి.
ఇక సాగర సంగమం, మేఘ సందేశం వంటి చిత్రాలు ఆమెలోని పరిపూర్ణమైన నటిని అద్భుతంగా ఆవిష్కరించాయి . అడవి సింహాలు, స్వయం వరం వంటి చిత్రాలు ఆమె అభినయానికి కొలమానాలుగా నిలిచాయి. నటిగా ఆమె వెండితెరకి దక్కిన పుణ్య ఫలం... అశేష ప్రేక్షకులకి లభించిన అందమైన వరం అని చెప్పక తప్పదు. సహజ సౌందర్య రాశి.. ఒక నాటి యువత కలల రాణి... నేటి యువ అందగత్తెల రోల్ మోడల్.అడవి రాముడు లో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ చిందేసి... అక్కినేనితో మేఘసందేశం పంపిన నెరజాణ.. మన జయప్రద. వయసు పెరిగినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం. 1980లో ప్రాంతంలో భారతీయ ప్రఖ్యాత నటులందరి సరసన నటించి మేటి నటిగా కీర్తి గడించిన జయప్రద ఇప్పటికీ అదే అందంతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ తదితర భాషల్లో హీరోయిన్గా వెలుగొందిన ఆమె పార్లమెంటు సభ్యురాలిగా రాజకీయాలలో సైతం రాణించారు.
ఇప్పటికీ రియాలిటీ షోలలో ...అడపాదడపా వెండితెర పై తళుక్కుమంటున్నారు. తెలిసీ తెలియని 13 ఏళ్ళ ప్రాయంలో వెండితెరకు వచ్చి నటిగా 35 ఏళ్ళ పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన జయప్రద ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఫ్లాట్ ఫాం అవసరం. అందుకే రాజకీయల్లోకి వచ్చారు. ధనార్జన కోసం మాత్రం కాదు. రాజకీయాలు నా మనస్తత్వానికి సరిపడవని తెలిసినా ఎన్టీఆర్ గారి ఒత్తిడి మేరకే రాజకీయాల్లోకి వచ్చానంటారు జయప్రద.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more