Festival raksha bandhan special

Festival Raksha Bandhan special.png

Posted: 08/02/2012 02:16 PM IST
Festival raksha bandhan special

Festival_Raksha_Bandhan_special

Raksha_Bandhan_specialప్రపంచంలో ఎన్నో బంధాలు - అనుబంధాలు ఉంటాయి. అయితే ఆ అనుబంధాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా పండుగ అంటూ ఉండదు. కానీ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా మాత్రం ఒక విశిష్టమైన పండుగ ఉంది. అదే రక్షాబంధనం. దీనికి రక్తసంబంధంతో పనిలేదు. ఎవరినైనా సరే తన సోదరుడిగా భావించాలనుకునే సోదరి, కేవలం రక్షాబంధనంతో ఆ బంధాన్ని శాశ్వతం చేసుకుంటుంది.

పురాణాలలో చూస్తే, శ్రీకృష్ణుడికి ద్రౌపది సహోదరి కాకపోయినా, ఆమెకు కురుసభలో వస్త్రాపహరణం జరిగి, అవ మాన భారంతో ఉన్నప్పుడు చీరలు ఇచ్చి రక్షించాడు ఒక సోదరుడిగా శ్రీకృష్ణుడు. జీవితాంతం ఆ బంధం అలాగే కొనసాగింది. సుభద్ర... అర్జునుడిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక సోదరుడిగా ఆమె కోరిక నెరవేరేలా చేశాడు. ఇదంతా దైవానికి సంబంధించిన నేపథ్యం.రాక్షసులు సైతం ఈ ప్రేమకు అతీతులు కారు. అయితే వారి ప్రేమ వ్యక్తం చేసినప్పుడు, అది వినాశనానికి దారి తీస్తుంది. శూర్పణఖ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోమని అన్నగారైన రావణుడిని వేడుకుంది. ఆమె కోరిక నెరవేర్చాడు. అయితే దాని ఫలితంగా లంకా వినాశనం జరిగింది. ఏది ఏమైనా మానవులలోనే కాకుండా దానవులలోనూ అన్నచెల్లెళ్ల అనుబంధం ఉంటుందని ఈ కథనం ద్వారా అర్థం అవుతుంది.

రాఖీ పండుగు ఆ పేరెలా వచ్చింది?

Raksha_Bandhan_special_1రాకా అనే మాటకి నిండుగా తన కున్న పదిహేను కళలలతోనూ చంద్రు డు ఉన్న పూర్ణి అని అర్థం. ఆ రాకా అంటే పౌర్ణమి రోజున కట్టే సూత్రం ఎదుందో దానికి రాకీ (రాకా సంబంధమున్న తాడు) పౌర్ణమి అని పేరు. కాలానుగుణంగా రాఖీ పౌర్ణమి, రాకీ సూత్రం రాఖీగా మారింది. ఈ పూర్ణిరోజున ఉదయ కాలంలో చక్కగా స్నానం చేసిన వ్యక్తి ఈ రాకీ సూత్రాన్ని తానెవరికి రక్షణగా సంవత్సర కాలం పాటు ఉండదలిచాడో వాళ్ల మణికట్టుకు కట్టి ముడివేసి దానిమీద అక్షతలు మనసూర్తిగా వేయాలని హేమచంద్ర గ్రంధంలో చెప్పబడింది.

పండుగ పరమార్థం

శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరిచేత రక్ష కట్టింకుం టే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి వస్తున్న విశ్వాసం. భారతీయ సంద్రాయం ప్రకారం ఇంటి ఆడపRaksha_Bandhan_special_2 డుచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవా రాల్లో పుట్టింటి నుండి పంపరు. అంతటి శక్తి గల సోదరిచేత రక్షాబంధన్‌ కట్టిం చుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవత లందరి అనుగ్రహం కలుగు తుందని మన పూర్వీకులు ఈ సంప్రదా యాన్ని ఆచరించారు. నుదుట తిలకం దిద్ది సోదరునికి దేవతలందరూ రక్షగా ఉం డాలంటూ ...రక్షాబంధన్‌ కట్టి తీపి తినిపిస్తుంది. అందు కు ప్రతిగా సోదరుడు తన ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఆమెకు జీవితాంతం అండగా నిలుస్తాతని మానమర్యాదలు కాపాడతానని చెబుతూ ఆమెకు పసుపు, కుంకుమ ఇవ్వడం సంప్రదాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director nandini reddy interview
Freedom fighter laxmi sehgal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles