సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు ఇప్పటినుండే అప్రమత్తమయ్యారు. ఇతర స్థానాల నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలలో నేతలు ఇతర ప్రాంతాలపై కన్నేశారు. ఇక్కడ రెండు పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో సగానికి పైగా కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయని తెలుస్తోంది. మరోవైపు కొంతమంది నేతలు గెలుపు అవకాశాలపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో కాంగ్రెస్, టిడిపి పార్టీలతో పాటు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగంలోకి దిగుతోంది. ఇక్కడ జిల్లా మంత్రి పార్థసారధి, ఎంపి లగడపాటితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు ఇతర స్థానాలపై కన్నేశారు.
విజయవాడ ఎంపి లగడపాటి ఈసారి విశాఖ లేదా గుంటూరు నుండి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా వ్యవహరిస్తున్న పార్థసారధి పెనమలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆయనకు సామాజిక వర్గాల సమస్య ఎదురు కానుంది. దీనితో కైకలూరు, నూజివీడు, మచిలీపట్నం నియోజకవర్గాల నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన కాంగ్రెస్ జెండాను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను ఎత్తుకొన్నారు.నూజివీడు ఎమ్మెల్యే చినం రామకోటయ్య (టిడిపి) ఎక్కడి నుండి పోటీ చేయాలి, లేక పార్టీ మారాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more