Samaikya andhra sega vs telangana issue

samaikya andhra sega, telangana vs samaikya andhra, samaikya andhra sega vs telangana issue, samaikyandhra movement,breaking news, ap politics, political news, andhra news

samaikya andhra sega vs telangana issue

విభజిస్తే ఆందోళనలు

Posted: 07/29/2013 06:04 PM IST
Samaikya andhra sega vs telangana issue

రాష్ట్రాన్ని విభజించాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే ఆందోళనలు ఉద్రుతం చేస్తామని శ్రీకాశహస్తి బార్ అసోసియేషన్ అద్యక్షడు శేఖర్ అన్నారు. సమైక్యవాదానికి మద్దతుగా ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో ద్విచక్రవాహనాలపై ర్యాలీపై పాటు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మదనపల్లి లో సమైక్యాంద్రకు మద్దతుగా సాక్స్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మల్లికార్జున సర్కిల్ లో ఆందోళన చేశారు. అలాగే బీజేపి ఆద్వర్యంలో స్థానికి ఎన్టీఆర్ సర్కిల్ లో యూపీఏ ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. మదనపల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో న్యాయమూర్తులు ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా తిరుపతిలో సమైక్యాంద్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంపీలు శివప్రసాద్ , చింతామోహన్ ఇళ్ల ముట్టడికి ఉపాద్యాయ, విద్యార్థి, ఫించన్ దార్ల ఐకాస ఈ ఉదయం యత్నించింది. సమైక్యాంద్రకు మద్దతుగా నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంద్రకు మద్దతుగా సీమాంద్రలో అన్ని చోట్లు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles