Tirumal brahmotsavam from oct 5

Tirumala Brahmotsavam from oct 5, Vekateswara Annual Brahmotsavams, Tirumal Tirupathi Devasthanams, Golden Chariot at Tirumala, Golden Chariot for Venkateswara Swamy

tirumal brahmotsavam from oct 5

తిరుమలలో బ్రహ్మోత్సవాలు

Posted: 07/24/2013 03:45 PM IST
Tirumal brahmotsavam from oct 5

బ్రహ్మోత్సవాలంటే భక్తులకు, తిరుపతి వాసులకు పండుగే.  ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీవారి దర్శనం చేసుకోవటానికి భక్తలు ఉత్సాహం చూపిస్తారు.   సమయంలో రద్దీ వలన తిరుపతి పట్టణంలో కూడా వ్యాపారం బాగా పుంజుకుంటుంది. 

తిరుమల వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులు తేదీలను ఖరారు చేసారు.  చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయి కాబట్టి రెండు నెలల ముందుగానే నిర్ణయించుకోవటం తితిదే కి తప్పనిసరౌతుంది.  అక్టోబర్ 5 నుంచి 13 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను జరిపించాలని, 9 న గరుడ సేవ, 10 న స్వర్ణ రథం మీద ఊరేగింపు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 

ప్రతిసారీ ఏర్పాట్లు ముమ్మరంగానే చేస్తారు కానీ ఈ సారి ప్రత్యేకత కొత్త బంగారు రథం.  పాత వెండి రథం మీద బంగారు పూత పూసి కొత్తగా మెరిపించి దాని మీద శ్రీవారిని ఊరేగింపజేయాలని తితిదే సంకల్పం.  ఆ రథాన్ని సిద్ధం చెయ్యటానికి సన్నాహాలను ముందుగానే చెయ్యటం ప్రారంభించారు.  అక్టోబర్ 10 లోపులో కొత్త స్వర్ణ రథం పని పూర్తవుతే సరేసరి, స్వామివారు దానిమీద ఊరేగుతారు.  ఆ పని కాకపోతే మరో పాత స్వర్ణ రథం ఉండనేవుంది. కాకపోతే పాత స్వర్ణరథం బాగోలేదని భక్తులు ఆరోపణలు చెయ్యబట్టే తితిదే యాజమాన్యం మరో రథాన్ని తయారుచేస్తోంది.

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles