Fake pujari halchal

fake pujari halchal in chittoor district, balasubrahmanyam v kota mandalam, kabbanahalli village,

fake pujari halchal

పూజారి

Posted: 06/03/2013 05:30 PM IST
Fake pujari halchal

చిత్తూరు జిల్లా, వి.కోట మండలం, కబ్బనహళ్లి గ్రామంలో బాలసుబ్రహ్మణ్యం అనే పూజారి తనను తాను దైవదూతగా అభివర్ణించుకుంటూ, జనాన్ని ఆకర్షిస్తున్నాడు. దెయ్యాలు తన ముందు బలాదూర్ అని బీరాలు పోతున్నాడు. వింత, వింత చేష్టలతో జనాన్ని నిశ్చేష్టులను చేస్తున్నాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ లేనిపోని భ్రమలను కల్పిస్తాడు. ఇదంతా నిజమేననుకుని కొందరు తల్లిదండ్రులు గుడ్డి నమ్మకంతో ఈ పూజారి చేతికి తమ బిడ్డలను అందిస్తూ, ఆయురారోగ్యాలు ప్రసాదించమంటూ వేడుకుంటున్నారు. దీంతో సదరు దైవదూత చంటిపిల్లలను గాల్లో గిరగిరా తిప్పుతూ.. పూనకంతో ఊగిపోతూ జనాన్ని కనికట్టుతో కట్టిపడేస్తున్నాడు. ఇంతటితో ఇతగాడి ఆగడాలు ఆగవు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడంటాడు. ఆయా సందర్భాల్లో తెగ ఊగిపోతూ.. ఎక్కడ లేని నటననూ ప్రదర్శిస్తుంటాడు. దీంతో సాక్షాత్తూ భగవంతుడే తమతో మాట్లాడుతున్నాడనుకుని జనం మైమరిచిపోతున్నారు.పూజలు చేస్తూ, హరతులు పడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇదేమీ నిన్నమొన్నటి వ్యవహారం కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న తంతు. మొత్తానికి భక్తుల సేవలతో సదరు పూజారి వెలిగిపోతూనే ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles