Bulky balaji dies

Sri Venkateswara Zoological Park, Bulky Balaji dies, illness and old age, S Saravanan

Bulky Balaji dies

అలిపిరి జూపార్కులో చిరుత 'బాలాజీ' ఇక లేదు

Posted: 06/12/2013 03:27 PM IST
Bulky balaji dies

శ్రీ వెంకటేశ్వర జూపార్కులో ఉన్న చిరుత (బాలాజీ) ఉదయం 4.30 నిమిషాలకు మరణించింది. సాధారణంగా చిరుతలు 12నుంచి 15 ఏళ్లు జీవిస్తాయి. 55 నుంచి 65 కిలోల బరువు తూగుతాయి. అయితే బాలాజీ శరీర సౌష్ఠవమే వేరు. సందర్శకులను విశేషంగా ఆకర్షించేది ఆ ఆకారమే. 1998 ఫిబ్రవరిలో ఈ జూపార్కు ఆవరణలోనే ఇది పట్టుబడింది. అప్పటినుంచి జూలోనే ఉంటోంది. పట్టుబడే నాటికే దాని బరువు 113 కిలోలు ఉంది. అప్పటికి దాని వయస్సు 12 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. అంటే ఇప్పడు దాని వయసు దాదాపు 27 ఏళ్లు. బరువు 143 కిలోల వరకు పెరిగింది. ఈ అసాధారణ లక్షణాలు ఉన్నందునే హైదరాబాదులోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు బాలాజీ సంతతిని పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్టు క్యూరేటర్ తెలిపారు. అలిపిరిలోని ఎస్వీ జూపార్కు సందర్శకులకు గత 15 ఏళ్లుగా కనువిందు చేస్తున్న అరుదైన చిరుత 'బాలాజీ' తీవ్ర అస్వస్థతకు గురయింది. రెండు రోజులుగా సరిగి ఆహారం తీసుకోవడం లేదని, పైగా వయోభారంతో శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటోందని జూపార్కు క్యూరేటర్ శ్రీ శరవణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles