The foods should not be taken at night before sleeping | health tips

The foods should not be taken at night before sleeping health tips

health tips, healthy foods, healthy food items, night foods, night foods tips, health benefits, night bad foods, biryani specials, coffee, tea, dark chocolates

The foods should not be taken at night before sleeping health tips : Experts giving some suggestions to not take some foods at night times which give problems.

రాత్రిపూట తినకూడని ఆహారాలు..

Posted: 05/16/2015 07:02 PM IST
The foods should not be taken at night before sleeping health tips

రాత్రిపూట నిద్రపోవడానికి ముందు కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో సహజంగా టీ, కాఫీ వంటి స్టిములంట్ డ్రింక్స్ తీసుకోకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఎందుకంటే.. కాఫీలో వుండే ‘కెఫిన్’, టీలో వుండే ‘థియోబ్రొమైన్’ వంటివి మెదడును చురుకుదనంగా పనిచేసేలా చేస్తాయి. ఫలితంగా త్వరగా నిద్రపట్టదు. అందుకే రాత్రిపూట పనిచేసేవారు టీ, కాఫీలు తాగడం.. అలాగే ఉదయం వేళల్లో తీసుకోవడానికి ఇదే కారణమని వారు చెబుతున్నారు. కాబట్టి.. రాత్రివేళల్లో వాటిని తీసుకోకుండా వుంటే.. త్వరగా నిద్రకు ఉపక్రమించవచ్చు.

ఇక రాత్రివేళల్లో పార్టీలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. పార్టీల్లో అధికంగా నాన్‌వెజ్‌కే ప్రాధాన్యం ఇస్తారు. ఎప్పుడో ఒకసారి జరిగే పార్టీల్లో మాంసాహారం తీసుకోవడం అంతగా ఇబ్బంది కలిగించదు కానీ.. ప్రతిరోజూ తింటే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. మాంసాహారం జీర్ణమయ్యేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అందుచేత రాత్రిపూట జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఉండటం ద్వారా జీర్ణ సమస్యలు తప్పవు. కాబట్టి మాంసాహారాన్ని మధ్యాహ్నం లేదా సాయంత్రంపూట అంటే నిద్రపోవడానికి ఇంకా నాలుగు గంటల సమయం వుండగానే తీసుకోవడం మంచిది.

అలాగే స్వీట్స్, చాక్లెట్, ఐస్ క్రీమ్ డెసర్ట్స్ వంటివి రాత్రిపూట తీసుకోకూడదు. వీటితో నిద్రలేమి సమస్యలు తప్పవు. వీటితోపాటు ఆకుకూరలు, కాకరకాయల్ని రాత్రిపూట తీసుకోకూడదు. పులుపుతో కూడిన ఆహార పదార్థాలను సైతం రాత్రిపూట తినడం మంచిది కాదు. ఇక జంక్ ఫుడ్‌కు రాత్రిపూట పూర్తిగా చెక్ పెట్టాలి. నిద్రించే ముందు మసాలాలతో కూడిన బిర్యానీ, జంక్ ఫుడ్‌ను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ తింటే నిద్రించేందుకు 4 గంటల ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఒబిసిటీ తప్పదు. అల్సర్ ఉన్నవారు పూర్తిగా జంక్ ఫుడ్ రాత్రుల్లో తీసుకోకూడదు.

నిద్రించే 8 గంటలు మన శరీరంలో మెదడు, గుండె మినహా అన్నీ అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. అలాంటి సమయంలో వాటికి ఎక్కువ పనిచెప్పడం మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం జీర్ణసమస్యలతోపాటు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy foods  biryani special items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more