The amazing healthy tips belly fat reduce health food items

health tips, health tips in telugu, health tips belly fat, tips to reduce belly fat, belly fat problems, healthy food belly fat, belly fat health tips, belly fat reduce tips, healthy foods, healthy food items

the amazing healthy tips belly fat reduce health food items

బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఆహార పదార్థాలు

Posted: 11/11/2014 04:17 PM IST
The amazing healthy tips belly fat reduce health food items

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యం మీద అంతగా దృష్టి సారించలేకపోతున్నారు. ఎక్కువసేపు కేవలం ఆఫీసు, ఇంటిపనిమీద లీనమైపోవడం వల్ల శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే సమయం దొరకదు. ఎన్ని పౌష్టికాహారాలు తీసుకున్న వాటివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కానీ.. రానురాను బద్దకస్తులు అయిపోతారు. అంటే.. సమయానికి వ్యాయామం చేయకపోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ఫలితంగా బద్దకస్తులు అవడంతోపాటు లావుగా మారిపోతారు. అయితే వెంటనే లావుగా మారరు కాబట్టి.. మొదట్లో చిరుబొజ్జ వస్తుంది. అటువంటి సంకేతాలు కనిపించిన వెంటనే ఆ సమస్య మరింత రెట్టింపు కాకుండా తగ్గించుకోవాలంటే కొన్ని ఆహారపదార్థాలు అందుబాటులో వున్నాయి. వాటిని నిత్యం తీసుకుంటే వ్యాయామం చేసే అవసరం వుండదు.. త్వరలోనే మంచి ఫలితాన్ని గుర్తించుకోగలుగుతారు. మరి ఆ ఆహారపదర్థాలేంటో తెలుసుకుందాం...

1. లెమన్ వాటర్ : నడుము చుట్టూ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి బెల్లీని ఫ్యాట్ ను కరిగించడంలో లెమన్ వాటర్ ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది.
విధానం : ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. అవసరమైతే అందులో కాస్త తేనె మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.. శరీరంలో కొవ్వు పదార్థాలు త్వరగా కరిగిపోతాయి. అయితే లెమన్ వాటర్ తీసుకున్న తర్వాత అరగంటసేపు ఇతర పానీయాలు, ఆహారాలు తీసుకోకూడదు.

2. క్రాన్ బెర్రీ జ్యూస్ : ఇందులో మాలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, క్వినిక్ ఆసిడ్స్ వంటి ఆర్గానిక్ యాసిడ్స్ వుంటాయి. ఇవి శరీరంలో జీర్ణ రసాలను ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేస్తాయి. అంతే కాదు.. కాలేయంలో వుండే లింపాటిక్ వేస్ట్ ను జీర్ణం అయ్యేలా చేసి.. జీర్ణక్రియకు అడ్డుపడే టాక్సిన్స్ ను తొలగించేస్తాయి.
విధానం : ఒక కప్పులో క్రాన్ బెర్రీ జ్యూస్ తీసుకుని అందులో కాస్త నీటిని కలుపుకోవాలి. ఈ మిత్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు ముందు తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.

3. ఫిష్ ఆయిల్ (ఫిష్) : ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తోపాటు ఐకోసపెంటాయోనిక్ యాసిడ్, డెకాసహెక్సానిక్ ఆసిడ్స్, లినోలెనిక్ ఆసిడ్స్ వంటివి శరీరంలో కొవ్వు నిల్వలను, నడుము చుట్టును ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతాయి.
విధానం : ప్రతిరోజూ 6గ్రాముల ఫిష్ ఆయిల్ ను తీసుకోవాలి. సాల్మన్, మెకరెల్ ఫిష్, హాలిబట్, తున వంటి చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా వుంటాయి. వాటిమీదే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది.

4. అల్లం టీ : ఇది ఒక థర్మోజెనిక్. ఈ ఏజెంట్స్ శరీరంలో వేడి పెంచుతుంది. తద్వారా కొవ్వ కణాలు ఎఫెక్టివ్ గా బర్న్ అవుతాయి. అంతే కాదు, అల్లం కార్టిసోల్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది. ఈ హార్మోన్ ఎనర్జీ అందించడంతోపాటు మెటబాలిజం రేటును పెంచడానికి సహాయపడుతుంది.
విధానం : ముందుగా నీళ్లను బాగా మరిగించుకోవాలి. అందులో తురుముకున్న అల్లం వేసి, తర్వాత స్టౌ నుంచి కిందకు దించాలి. అనంతరం నిమ్మరం, తేనె మిక్స్ చేయాలి. ఈ విధంగా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాన్ని గుర్తించుకోగలుగుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  belly fat tips  healthy food items  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more