The healthy food items for kidneys which prevents diseases

kidneys, healthy food for kidneys, health tips for kidneys, healthy kidneys, kidneys healthy tips, kidneys healthy food, healthy food items for kidneys

the healthy food items for kidneys which prevents diseases

కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు!

Posted: 11/07/2014 05:11 PM IST
The healthy food items for kidneys which prevents diseases

మానవ శరీరంలో వుండే అవయవాలలో కిడ్నీలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన శరీరంలో వుండే మలిన పధార్థాలను శుభ్రం చేయడంతోపాటు రక్తాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. అలాగే మూత్రవిభాగంలో కూడా దీని పాత్ర కీలకం. ఇటువంటి కిడ్నీలు పాడయితే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి... మన శరీరాన్ని శుభ్రపరిచే ఈ కిడ్నీలు నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే అందుకు కొన్ని ముఖ్యమైన ఆహారాలు అందుబాటులో వున్నాయి. అవేమిటంటే...

1. క్యాబేజ్ : ఇందులో పొటాషియం, విటమిన్ కె అధికంగా వుంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

2. కాలీఫ్లవర్: ఇందులో విటమిన్-సితోపాటు లో-పొటాషియం కూడా వుంటుంది. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. నిత్యం కిడ్నీలను శుభ్రం చేయడంలో తమవంతు పాత్ర వహిస్తాయి.

3. ఆపిల్స్ : శరీరంలో జీర్ణక్రియకు ఇవి బాగా సహాయపడుతాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మూత్రపిండాలను శుభ్రం చేయడంలో దోహదపడుతాయి.

4. ఉల్లిపాయలు : కిడ్నీలోని రాళ్ళను తొలగించి.. వాటిని నిత్యం శుభ్రపరచడంలో ఈ ఉల్లీల పాత్ర ఎంతో అద్భుతమైనది.

5. బీట్ రూట్: శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను నిర్వహించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. అలాగే ఇందులో వుండే విటమిన్-బి6, విటమిన్-కె కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతాయి.

6. బీఫ్ : ఈ మాంసంలో ప్రోటీనులు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి రెండూ కూడా ఆరోగ్యకరమైన కిడ్నీలకోసం చాలా అవసరం.

7. గుడ్లు : వీటిలో ప్రోటీనులు, విటమిన్-బి6, విటమిన్-డి సమృద్ధిగా వుంటాయి. అలాగే ఎగ్ వైట్ లో ప్రోటీనులు, అమినో ఆసిడ్స్ కూడా పుష్కలంగా వుంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా వుంచడంతోపాటు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి.

8. పాలు: ఇందులో విటమిన్-డి అధిక మోతాదులో వుంటుంది. ఇది శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా వుంచడంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

9. నీళ్ళు : కిడ్నీ వ్యాధులను నివారించడంలో నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ నీటిని బాగా తాగితే బ్లాడర్, మూత్రకోశ వ్యాధులు నయమవుతాయి. అలాగే ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచి అన్నిరకాల నొప్పులు, మంటలు తగ్గిస్తుంది. శరీరానికి హాని కలిగించే బాక్టీరియాను బయటకు పంపేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : health tips  human kidneys  healthy foods  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more