నేటి సమాజంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులకంటే ప్రైవేటు ఉద్యోగస్తులే చాలామంది వున్నారు. ఈ ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కూడా చాలానే వున్నాయి.
అయితే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఎప్పటికీ పరిమితం కావు. స్టాఫ్ ఎక్కువగా వున్నారనే కారణంతోనో, లాభాలు రావడం లేదనే కారణంతోనే ప్రైవేటు రంగంలో ఉద్యోగస్తులను ఖాతరు చేయకుండా తీసివేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్డ్ అయిన తరువాత వారికి పెన్షన్ లభిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారు. కానీ ప్రైవేటు రంగంలో వున్నవారికి అటువంటి సదుపాయాలు వుండవు. కష్టం చేసినంతవరకు మాత్రమే ఆదాయం లభిస్తుంది. ఉద్యోగం పోయిన తరువాత చేతిలో చిల్లగవ్వ కూడా మిగలదు.
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తారు కాబట్టి ఒకరి ఉద్యోగం పోయినా కొంతవరకు సమస్యలను అధిగమించవచ్చు. ఒకవేళ భర్తకు ఉద్యోగం పోయినట్లయితే ఆడవాళ్లు చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా వారికి ఆసరాగా, అండగా వుండాల్సి వుంటుంది.
నిరుద్యోగులగా మారిన భర్తలు కొన్నాళ్లవరకు నిరుత్సాహంగా వుంటారు. తరువాత ఏదో ఒకటి సాదిద్దామనే అత్యుత్సాహంతో చేయరాని తప్పులు చేస్తారు. పెట్టుబడులు పెట్టాలంటూ నిర్ణీతమైన ప్రణాళికలు లేకుండా అప్పులు చేసేస్తారు. పెట్టిన పెట్టుబడులో లాభాలు వస్తే ఫరువాలేదు.. కానీ అవి నష్టాలను తెచ్చిపెడితే సమస్యలు ఆకాశమే హద్దుగా మారిపోతాయి.
కాబట్టి నిరుద్యోగి అయిన తమ భర్తను, భార్యలు ఎలా సపోర్ట చేస్తారు.. వారికి ఏవిధంగా అండగా వుంటారు.. ఎలా నచ్చజెబుతారన్న విషయాలలో కొన్ని చిట్కాలు మీకోసం...
నిరుద్యోగిగా మారిన భర్తలు ఒక్కసారిగా నిరుత్సాహపరులు అయిపోతారు. తమలో తాము కుంగిపోతుంటారు. అటువంటి సమయంలో మీరు వారికి అండగా నిలబడాలి. మీరు వారికి అన్ని విషయాలలో సహాయం చేస్తారన్న నమ్మకాన్ని కలిగించాలి. వారిని మరింత నిరుత్సాహపెట్టకుండా ఉల్లాసంగా వుండేందుకు ప్రయత్నాలు చేయాలి.
ముందుగా కొద్దిరోజులవరకు అనవసరమైన ఖర్చులను వెచ్చించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భర్త నిరుద్యోగిగా వున్నప్పుడు అవసరంలేని వాటిని కొనుగోలు చేయడం కోసం అప్పులు చేయకుండా, మీరు సంపాదించే డబ్బుతో ఇంటి పరిస్థితులను చక్కబెట్టుకోవాలి.
ఉద్యోగం కోల్పోయి ఏకాకిగా వుంటున్న మీ భర్తను మీ మాటలతో సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి. ఇంకొక ఉద్యోగ అన్వేషణ కోసం వారిలో నైతికస్థైరాన్ని పెంచేందుకు సహకరించాలి. భర్తను చిన్నచూపు చూడకుండా, వారు చేసిన తప్పులను వేలు ఎత్తిచూపకుండా వారితో మర్యాదగా ప్రవర్తిస్తే... కొంతలో కొంతైనా ఉత్సాహం అతనిలో కలుగుతుంది.
ఆర్థికపరమైన పరిస్థితులు తీవ్రమైనప్పుడు పదేపదే వారిని ఇబ్బంది పెట్టకుండా, సున్నితమైన మాటలతో నచ్చజెప్పాలి. అతను ఏం చేయాలనుకుంటున్నాడో, ఎటువంటి ఆలోచనలు అతనిలో మెదులుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేనిమీద అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడో అడిగి తెలుసుకుని.. దానిమీదే వారికి ఆసక్తి కలిగేలా చేయాలి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more