PV Sindhu reaches quarter-finals of World Championships బీడ‌బ్ల్యూఎఫ్ ఛాంపియ‌న్‌షిప్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లోకి సింధు

Bwf world championships sindhu through to last eight srikanth in action against lu

BWF World Championships, Indian star shuttler, PV Sindhu, Pornpawee Chochuwong, Thailand, nemesis Tai Tzu Ying, Chinese Taipei, Kirsty Gilmour, Scotland, Quarter-finals, sports, Badminton

PV Sindhu progressed to the quarter-finals of the 2021 BWF World Championships in Huelva by defeating Pornpawee Chochuwong of Thailand in the round of 16. The ace India shuttler defeated her Thai opponent in straight sets 21-14, 21-18 in a game that lasted for 48 minutes.

బీడ‌బ్ల్యూఎఫ్ ఛాంపియ‌న్‌షిప్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లోకి సింధు

Posted: 12/16/2021 09:19 PM IST
Bwf world championships sindhu through to last eight srikanth in action against lu

భార‌త స్టార్ ష‌ట్ల‌ర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన స‌త్తా చాటింది. బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా బ‌రిలో ఏకైక భారతీయ షెట్లర్ సింధు. 2019లో బెసెల్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో సింధు ప్రపంచ ఛాంపియన్ గా అవరించింది. అయితే గత ఏడాది జరగాల్సిన బీడబ్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా నిర్వహిస్తున్న బీడబ్యూఎప్ పోటీలలో సింధూ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. థాయ్‌ల్యాండ్ కు చెందిన పాన్‌పావీ చోచువాంగ్‌పై విజ‌యం సాధించి క్వార్ట‌ర్స్ చేరింది. రౌండ్‌-3 మ్యాచ్లో వీళ్లిద్ద‌రూ త‌ల‌పడ్డారు. ఈ మ్యాచ్‌లో 21-14, 21-18తో వ‌రుస సెట్ల‌లో గెలిచిన సింధు.. చోచువాంగ్‌ను మ‌ట్టిక‌రిపించింది. మొత్తం 48 నిమిషాల‌పాటు ఈ మ్యాచ్ జ‌రిగింది. ఇంత‌కుముందు వీళ్లిద్ద‌రూ ఆడిన చివ‌రి రెండు మ్యాచుల్లోనూ సింధు ఓట‌మిపాలైంది. ఇదిలావుండగా క్వార్టర్స్‌లో ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్ మెడల్ ను అందుకున్న సింధూ క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ తైజు యింగ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. స్కాల్యాండ్ కు చెందిన క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్ ను 21-10, 19-21, 21-11 ఓడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles